అనగనగా ఓ హీరోయిన్..2014లో కాస్త చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించింది. ఫరవాలేదు మరో ఫిమేల్ స్టార్ టాలీవుడ్ కు దొరికింది అనకున్నారంతా..
అనగనగా ఓ హీరో…ఏదో పడుతూ లేస్తూ..మెల్లిగా స్టాండ్ అవడానికి ట్రయ్ చేస్తున్నాడు. ఫరవాలేదు..ఇలా వెళ్తే కొన్నాళ్లకు స్టడీ అయిపోతాడు అనకుంటున్నారంతా..
కానీ అక్కడే కథలో ఇంటర్వెల్ బ్యాంగ్ మోగింది.
ఆ హీరోయిన్..ఈ హీరో..చెట్టపట్టాలేసుకున్నారు. హాయి హాయిగా..జాలీ జాలీగా..తిరిగేస్తున్నారట..
ఇది ప్రేమో..మైకమో..మరేమిటో…అన్నది తెలియదు..ప్రేమాభిషేకంలో ప్రభాకరరెడ్డి డైలాగులా..ఏ సందులో చూసినా వారేనట..ఏ వీధిలో చూసినా వారేనట.
వాళ్ల బాధ వాళ్లు పడతారు..మనకెందుకు మధ్య అనే మహానుభావులు వుంటారు..కానీ రెండు పాయింట్లు వున్నాయి..అయ్యో ఈ తిరుగుళ్లలో పడి మంచి కెరీర్ కు ఆ అమ్మాయి దూరమవుతుందే..అన్నది ఒకటి.
ఇలాగే ఆ మధ్య కష్టపడి హీరో స్టేజ్ కు వచ్చిన నటుడు కూడా అమ్మాయి ధ్యాసలో పడి కెరీర్ పాడుచేసుకునాడే..ఈ కుర్రాడూ అంతేనా అన్నది మరొకటి. ఇంత రాసిన వాళ్లు హీరొ..హీరోయిన్ ల పేర్లు కూడా రాయచ్చు కదా అనొచ్చు..సినిమాలు ఫాలో అయ్యేవాళ్లకి ఇట్టే అర్థమైపోతుంది. సినిమాల్లో వున్నవాళ్లకి ఇప్పటికే తెలిసిన వ్యవహారమే ఇది.