భయ్యా..సునీల్ ఫీల్డ్ లోనే వున్నారు

సునీల్…ఓ మంచి కమెడియన్. కానీ సినిమా ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికీ చాన్స్ దొరికితే హీరో అయిపోదామన్నదే లక్ష్యం. అందుకే కష్టపడి హీరో అయ్యాడు. కానీ ఏం లాభం..టాలీవుడ్ లోని అనేక మంది హీరో…

సునీల్…ఓ మంచి కమెడియన్. కానీ సినిమా ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికీ చాన్స్ దొరికితే హీరో అయిపోదామన్నదే లక్ష్యం. అందుకే కష్టపడి హీరో అయ్యాడు. కానీ ఏం లాభం..టాలీవుడ్ లోని అనేక మంది హీరో టర్న్ డ్ కమెడియన్ ల మాదిరిగానే తయారైంది అతగాడి కెరీర్ కూడా. 

రేలంగి, రాజబాబు, దగ్గర నుంచి ఆలీ బ్రహ్మానందం వరకు అందరూ హీరోగా చేద్దామని ట్రయ్ చేసి, పరిస్థితి అర్థం చేసుకుని కమెడియన్లుగా కొనసాగుతున్నవారే. కానీ సునీల్ మాత్రం హీరోగానే ఫిక్సయిపోయాడు. దాంతో జనం ఆయన్ను మరిచిపోయే పరిస్థితి వచ్చేసింది. 2014 మొత్తం మీద భీమవరం బుల్లోడు అనే ఒక్క సినిమా చేయగలిగాడు. అది హిట్ అనిపించుకున్నా కూడా మరో సినిమా చేతిలోకి రాలేదు.

 రెమ్యూనరేషన్ దగ్గర కాంప్రమైజ్ కావడం లేదని, తనకు పక్కా ఫైట్లు, పాటలు దండిగా వున్న మాస్ మసాలా సబ్జెక్ట్ లే కావాలంటున్నారని, ఇలా రకరకాల కబుర్లు వినిపిస్తున్నాయి. మరి సునీల్ ధీమా ఏమిటో? ఎప్పటికైనా ఒక్క సినిమా చేసినా చాలు, హిట్ కొడితే మళ్లీ పైకి వెళ్లచ్చు అనా..లేక, సరైన సబ్జెక్ట్ లు ఆయన దగ్గరకు రావడం లేదా? 

ఏమైనా సునీల్ మంచి నటుడు, అతను హీరోగా మారడం వల్ల టాలీవుడ్ ఓ అద్భతమైన కమెడియన్ ను మిస్సవుతోంది. ఇప్పటికైనా సునీల్ పంథా మార్చుకుని కాస్త ఎక్కువగా కనిపించాలన్నది అభిమానుల కోరిక. అవసరమైతే పారితోషికం తగ్గించుకునైనా, సపోర్టింగ్ క్యారెక్టర్లు అంగీకరించి అయినా.