తుంటి కొడితే పళ్లు రాలడం అంటే ఇదే. ఆ సినిమాలు బాక్సాఫీసు దగ్గర విఫలం కావడం ఏమిటి? ఈ సినిమాకు ఎఫెక్ట్ ఏమిటి? అంటే టాలీవుడ్ లో అంతే అంతే..అనుకోవాలి. థియేటర్ల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని బయ్యర్లు నిర్మాతకు పేమెంట్ చేస్తారు. ఆ పేమెంట్ లతో నిర్మాత ఫైనల్ సెటిల్ మెంట్ లు చేస్తారు.
చాలా వరకు పెద్ద సినిమాలకు బయ్యర్లు కామన్ గా వుంటారు. ఇప్పుడు బెంగాల్ టైగర్ కు అడ్వాన్స్ లు అడిగితే, థియేటర్ల జనాలు ఏమంటారు? అసలే అఖిల్ దెబ్బకు కుదేలయ్యాం. ముందు ఆ లెక్కలు తేల్చండి అంటారు. మరి అడ్వాన్స్ లు రాకుండా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతకు పేమెంట్ ఎక్కడ నుంచి తెస్తారు..అందుకే కిందా మీదా పడుతున్నారు..నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు.