సాయి కొర్రపాటి జోరు

సాయి కొర్రపాటి ఎక్కడలేని జోరు మీద వున్నారు. బాహుబలిని బెంగుళూరు, సీడెడ్, కృష్ణాకు కొన్నారు. మంచి లాభాలు చేసుకునే అవకాశం స్ఫష్టంగా కనిపిస్తోంది. దాంతో కృష్ణలో తన రెండో వెంచర్ గా గుణశేఖర్ రుద్రమదేవి…

సాయి కొర్రపాటి ఎక్కడలేని జోరు మీద వున్నారు. బాహుబలిని బెంగుళూరు, సీడెడ్, కృష్ణాకు కొన్నారు. మంచి లాభాలు చేసుకునే అవకాశం స్ఫష్టంగా కనిపిస్తోంది. దాంతో కృష్ణలో తన రెండో వెంచర్ గా గుణశేఖర్ రుద్రమదేవి సినిమాను కొన్నారు. 2.80 కోట్లకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే రుద్రమదేవిని సీడెడ్ కు ఆయనే తీసుకున్నారు. ఇదిలా వుంటే త్వరలో రాబోయే సల్మాన్ ఖాన్ భజరంగ్ భాయిజాన్ పంపిణీ హక్కులు కూడా సీడెడ్ మేరకు తీసుకున్నాట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాహుబలి విజయం సాయి కొర్రపాటికి ఎక్కడ లేని ఊపు ఇచ్చినట్లు కనిపిస్తోంది.