గత నెల్లోనే 16 ఏళ్లు నిండాయంటున్న హీరోయిన్

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ, ఇప్పుడు నాని సరసన హాయ్ నాన్న అనే సినిమా చేసింది. తాజాగా…

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ, ఇప్పుడు నాని సరసన హాయ్ నాన్న అనే సినిమా చేసింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ విలక్షణంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా మృణాల్ కు సంబంధించి వెబ్ లో ఎక్కువమంది వెదికిన ప్రశ్నల్ని ఆమె ముందుంచాడు నాని.

ఆ ప్రశ్నల్లో మృణాల్ వయసు ఎంత అనే ప్రశ్న కూడా ఉంది. దానికి సమాధానమిచ్చిన ఈ చిన్నది, గత నెల్లోనే తనకు 16 ఏళ్లు నిండాయని ఫన్నీగా చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో తన అసలు వయసును కూడా బయటపెట్టింది. ఆమె వయసు 31 ఏళ్లు.

మృణాల్ ఎత్తు.. 5 అడుగుల 6 అంగుళాలు. ఆమెకింకా పెళ్లి కాలేదు. స్టిల్ బ్యాచిలర్. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయాల్ని తనే స్వయంగా వెల్లడించింది. ఇక తన ఆస్తి గురించి మాట్లాడుతూ.. తన నెట్ వర్త్ వెలకట్టలేనిదని చెప్పుకొచ్చింది.

నిజానికి డెంటిస్ట్ అవ్వాలనుకుంది మృణాల్. కానీ తన కెరీర్ ను మార్చుకోవాలనుకుంది. అదే టైమ్ లో ఓ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లింది. అలా మొదటి ఆడిషన్ కే మరాఠీ సినిమాలో నటించే అవకాశం అందుకుంది.