వర్మకు మోహన్ బాబు అక్షింతలు

వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలు దెబ్బతీసి, పలు కేసుల్లో ఇరుక్కున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సీనియర్ నటుడు మోహన్ బాబు తలంటేసారు. వినాయకచవితి రోజే ఇంటికి పిలిచి, మొఖాన గంథం…

వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలు దెబ్బతీసి, పలు కేసుల్లో ఇరుక్కున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సీనియర్ నటుడు మోహన్ బాబు తలంటేసారు. వినాయకచవితి రోజే ఇంటికి పిలిచి, మొఖాన గంథం పెట్టి, నెత్తిన అక్షింతలు వేసి, ఆపైన గంట సేపు క్లాసు పీకారట. 

'నీ అభిప్రాయాలు నీకు వుండోచ్చు..నువు నాస్తికుడవైతే కావచ్చు, కానీ వాటిని వ్యక్తపరిచే భాష,. విధానం ఇది కాదు. అడిగే విధానంగా సందేహాలు అడిగితే అందరూ సంతోషిస్తారు. అంతే కానీ నొప్పించేలా మాట్లాడడం తగదు' అని మొదలు పెట్టి, ఫుల్ మీల్స్ పెట్టసారట. 

ఎస్..ఎస్ అనడం తప్ప వర్మ మారు మాట్లాడ లేదట. అయినా వర్మకు ఇలాంటి క్లాసులు, కేసులు కొత్త కాదు. ఈ మధ్య క్రియేటివిటీ అంతా ఇలాంటి కేసులకు దారితీసే వ్యవహారాలపై పెడుతున్నాడు వర్మ.