అఖిల్ సినిమా వాయిదా పడడం అన్నది ఓ మైనస్ . మాంచి డేట్ నుంచి వెనక్కు వచ్చి దీపావళికి ఫిక్సయింది. కానీ తెలుగులో దీపావళికి వచ్చి, హిట్ కొట్టిన సినిమాలు దాదాపు లేవనో, ఒకటో, అరో వున్నాయనో అన్నది టాలీవుడ్ టాక్. పైగా తెలుగు జనాలకు అమావాస్య అంటే భయం. అందకే నాగ్ కూడా ముందుగా శుక్రవారం విడుదల చేసాం అన్నట్లుగా ఓ షో వేయించారు.
తలా వెయ్యితో టికెట్ లు కొన్నారు. అదే సెంటిమెంట్ అనుకుంటే, మన వాళ్లకి ద్వితీయ విఘ్నం అనే సెంటిమెంట్ కూడా వుంది అంటే స్టార్ట్ చేస్తే, రెండో రోజు కూడా చేయాలి. మరి అది చేయలేదు నాగ్.ఇదిలా వుంటే దీపావళి రోజు ఫస్ట్ షోలకు జనాలు రావడం తక్కువ. ఒకటి రెండేళ్ల కిందటి వరకు దీపావళి రోజున ఫస్ట్ షోలు క్యాన్నిల్ చేసేవారు. ఇప్పుడిప్పుడు చాలా వరకు వేస్తున్నారు.కొన్ని చోట్ల క్యాన్సిల్ చేస్తున్నారు.
అందువల్ల ఫస్ట్ డే కలెక్షన్లు కాస్త తగ్గే ప్రమాదం వుంది. అఖిల్ కు ఓపెనింగ్స్ కూడా డల్ గా స్టార్ట్ అయ్యాయి. ఆన్ లైన్ బుకింగ్ లు రెండు రోజులు ముందే తెరిచినా, స్లోగా నడస్తున్నాయి. సోమవారం రాత్రి వరకు ఐమాక్స్ బిగ్ స్క్రీన్ ఉదయం తొలి ఆటకే ఇంకా సగం కూడా ఫుల్ కాలేదు. డేట్ మార్చడం అఖిల్ కు తప్పయిందేమో?