టెన్షన్ పెడుతున్న ప‌వ‌న్‌

సంక్రాంతి బ‌రిలో నిలిచిన చిత్రం గోపాల గోపాల‌. ఈ సినిమాని జ‌న‌వ‌రి 14న తీసుకొద్దామ‌నుకొన్నారు. అయితే జ‌న‌వ‌రి 9 చిత్రబృందాన్ని ఊరిస్తోంది. ఆ రోజున విడుద‌ల చేస్తే సినిమాకి ఇంకా ప్లస్ అవుతుంద‌ని, సంక్రాంతి…

సంక్రాంతి బ‌రిలో నిలిచిన చిత్రం గోపాల గోపాల‌. ఈ సినిమాని జ‌న‌వ‌రి 14న తీసుకొద్దామ‌నుకొన్నారు. అయితే జ‌న‌వ‌రి 9 చిత్రబృందాన్ని ఊరిస్తోంది. ఆ రోజున విడుద‌ల చేస్తే సినిమాకి ఇంకా ప్లస్ అవుతుంద‌ని, సంక్రాంతి వ‌ర‌కూ నిల‌బెడితే క‌లెక్షన్లకు ఢోకా ఉండ‌ద‌ని టీమ్ భావిస్తోంది. అందుకే పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు మ‌రింత వేగ‌వంతం చేస్తోంది టీమ్‌.

అయితే గోపాల గోపాల బృందాన్ని మాత్రం ప‌వ‌న్ టెన్షన్ పెడుతున్నాడు. ఈ సినిమా కోసం మ‌రో పాట చిత్రీక‌రించాల్సివుంది. ఆర్ ఎఫ్ సీలో ఇందుకోసం ఓ సెట్ కూడా వేశారు. అయితే ప‌వ‌న్ కోసం వెయిటింగ్‌. ప‌వ‌న్‌, వెంకీల‌పై ఈ పాట తెర‌కెక్కించాలి. మ‌రో రోజు షూటింగ్ బ్యాలెన్స్‌. కానీ ప‌వ‌న్ మాత్రం హ్యాండిస్తున్నాడు. సోమ‌వారం పూర్తవ‌వ‌ల‌సిన గీతం మంగ‌ళ‌వారం కూడా కంటిన్యూ చేయాల్సిన ప‌రిస్థితి. 

ప‌వ‌న్ ఈ రోజు హ్యాండిస్తే 9వ తారీఖున సినిమాని విడుద‌ల చేయ‌డం సాధ్యమా??  అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. మ‌రోవైపు మిగిలిన ప‌నుల‌న్నీ పూర్తయ్యాయి. ఈ పాట ఒక్కటే బాకీ. కాబ‌ట్టి అంత కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చిత్రబృందం భావిస్తోంది. ప‌వ‌న్ ఎప్పుడు క‌రుణిస్తాడో ఏంటో..?