2015లో రాబోతోన్న తెలుగు సినిమాల్లో ‘బాహుబలి’ అగ్ర తాంబూలం అందుకుంటుందని, తప్పకుండా ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పుతుందని అందరూ బలంగా నమ్ముతున్నారు. రాజమౌళిపై కాన్ఫిడెన్స్… ఆ సినిమాకున్న స్పాన్ అందరిలోను తిరుగులేని నమ్మకాన్ని కలిగిస్తోంది. అందుకే బిజినెస్ కూడా ఆ లెవల్లో జరుగుతోంది.
ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప రికవర్ కాని రేట్లకి బయ్యర్లు బాహుబలిని కొనేస్తున్నారంటేనే దీనిపై ఎలాంటి అంచనాలున్నాయనేది అర్థమవుతోంది. 2015కి టాప్ హిట్‌గా బాహుబలి నిలుస్తుందనే అంచనాల నేపథ్యంలో సూపర్‌స్టార్స్ అయిన పవన్, మహేష్, ఎన్టీఆర్‌లాంటి వాళ్లకి ఇది పెద్ద సవాల్‌గా మారింది. బాహుబలిని సవాల్ చేసే విజయాన్ని ఆయా హీరోలు అందుకోగలరా?
రాజమౌళి, చారిత్రిక నేపథ్యం లేని సినిమాల్తో బాహుబలిని తలదన్నే సినిమాని వీరెవరైనా అందించగలరా? లేక అందరి నమ్మకాలకి తగ్గట్టు బాహుబలికే 2015 కిరీటం కైవసమైపోతుందా?