‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో పాపులర్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం గోపీచంద్‌తో ‘లౌక్యం’, రామ్‌తో ‘పండగ చేస్కో’ చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా అగ్ర హీరోల సరసన ఆఫర్లు దక్కని రకుల్ ప్రీత్ ఆ ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. స్టార్ హీరోలకి, మీడియం రేంజ్ హీరోలకి నడుమ వారధిలా ఉన్న రవితేజతో ఇప్పుడు రకుల్‌కి ఛాన్సొచ్చింది.
రవితేజ ‘కిక్ 2’ చేసేది ఈమెతోనే అని సమాచారం. సురేందర్ డైరెక్షన్లో కళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌ని కన్సిడర్ చేస్తున్నారు. చిన్న సినిమాల నుంచి ప్రమోషన్ దక్కక, పెద్ద అవకాశాలు రాక లో బడ్జెట్ హీరోయిన్గా మిగిలిపోయిన రెజీనాకి ‘పవర్’తో రవితేజే ప్రమోషనిచ్చాడు.
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్‌కి బిగ్ బ్రేక్ ఇచ్చే రెస్పాన్సిబులిటీ కూడా తనే తీసుకున్నాడు. ప్రస్తుతం తమన్నా, సమంత, శృతి హాసన్ చుట్టే తిరుగుతోన్న అగ్ర హీరోలు కనీసం రవితేజ చిత్రాలతో అయినా రకుల్, రెజీనాలాంటి వారిని గుర్తిస్తారో లేదో మరి.