పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరాఠీలో ఒక సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఆమె తరచుగా పవన్‌కళ్యాణ్ పేరు వాడుకుంటోంది. ట్విట్టర్‌లో పదే పదే పవన్ నామ స్మరణ చేస్తూ వార్తల్లో ఉంటోంది. మరాఠీ సినిమాకి పవన్ పేరెందుకు వాడుకుంటుందో అనే దానికి ఇప్పుడు ఆన్సర్ దొరికింది.
ఈ చిత్రాన్ని ఆమె తెలుగులో కూడా అనువదిస్తోంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరాఠీ అనువాద చిత్రానికి తెలుగులో ఆదరణ ఉంటుందా? అందుకే రేణు దేశాయ్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. పవన్‌కళ్యాణ్ కొడుకు అకిరానందన్‌తో ఇందులో చిన్న వేషం వేయించింది. ఇప్పుడు బుల్లి పవర్‌స్టార్‌ని చూడ్డానికైనా కొందరు పవన్ వీరాభిమానులు ఈ సినిమా చూస్తారు కదా!
ఎవరెవరో పవన్ పేరుని, అతని సినిమాల్లోని సీన్లని, సాంగ్స్‌ని వాడేసుకుంటూ ఉంటే తాను ఎందుకు ఆ అడ్వాంటేజ్‌ని క్యాష్ చేసుకోకూడదని అనుకుందో ఏమో రేణు దేశాయ్ తీస్తున్న సినిమాకి బాగానే పబ్లిసిటీ వచ్చింది.