గీతాంజలి గా స్వాతి

తెలుగు అమ్మయి కావడంతో ఎక్కువ అవకాశాలు రాలేదేమో కానీ, స్వాతి మాత్రం మాంచి చలాకీ నటిగా ప్రూవ్ చేసుకుంది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ, లైవ్ లో వుంటూ వస్తోంది. ఇప్పుడు స్వాతికి మరో మంచి…

తెలుగు అమ్మయి కావడంతో ఎక్కువ అవకాశాలు రాలేదేమో కానీ, స్వాతి మాత్రం మాంచి చలాకీ నటిగా ప్రూవ్ చేసుకుంది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ, లైవ్ లో వుంటూ వస్తోంది. ఇప్పుడు స్వాతికి మరో మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. నిజానికి స్వాతికి అవకాశం దక్కింది అనే కన్నా, అంజలి మంచి చాన్స్ పొగొట్టుకుంది అనడం బెటర్. 

ఎందుకంటే ఈ చాన్స్ అంజలిదే. ఆమె గతంలో నటించిన హిట్ గీతాంజలి కి సీక్వెల్. అయితే మరి బేరం సెట్ కాలేదో, మరే కారణమైనా వుందేమో కానీ, ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు రాజ్ కిరణ్ తన సీక్వెల్ కు స్వాతిని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. 

స్వాతి పారితోషికం దగ్గర పెద్దగా పట్టుదలకు పోదు. పైగా ఆ క్యారెక్టర కు తగినట్లు చలాకీగా, ఈజ్ తో నటిస్తుంది. కానీ మరీ గ్లామర్ ఒలకబోయాలంటే మాత్రం సరిపోకపోవచ్చు. ఎనీహౌ..గుడ్ లక్ స్వాతి