మెగా కలివిడి కనిపించదా?

ఇకపై మెగా హీరోలు ఒక్క చోట చేరడం, ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం వంటి వ్యవహారాలు కనిపించవా? ముకుంద సినిమాకు మెగాహీరోల సపోర్టు కనిపించని తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మెగాభిమానులు ఇస్తున్న సమాధానం…

ఇకపై మెగా హీరోలు ఒక్క చోట చేరడం, ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం వంటి వ్యవహారాలు కనిపించవా? ముకుంద సినిమాకు మెగాహీరోల సపోర్టు కనిపించని తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలకు మెగాభిమానులు ఇస్తున్న సమాధానం చూస్తుంటే అలాగే వుంది. 

మన వాళ్ల సినిమాలను మనమే చూడాలని చెప్పడం, మన ఫంక్షన్లకు మనమే బొలోమని వెళ్లడం అంత బాగా వుండడంలేదని మెగాఫ్యామిలీ భావిస్తోందట. అందుకే ఇకపై అలా వద్దని అనకుంటున్నారట. పైగా అందరూ వెళ్లినా, ఒక్కరు మిస్సయినా, మీడియా అదేదో సమస్య అన్నట్లు ఫోకస్ పెడుతోందని, అదే ఇలా వెళ్లడం మానేస్తే, ఆ అలవాటు పోతుందని అనుకుంటున్నారట. 

ముకుంద సినిమాలో చరణ్ లేదా బన్నీ కామియో రోల్స్ లో అయిన కనిపిస్తే బాగుండేది అని నాగబాబును ఇష్టపడే అభిమానులు భావిస్తున్నారట. శేఖర్ కమ్ముల బదులు అదేబస్సులో, అదే సీట్లో రామ్ చరణ్ లేదా బన్నీ వుండి వుంటే సినిమాకు అడిషనల్ మైలేజీ వచ్చేది కదా అంటున్నారు. రామ్ చరణ్ సినిమాలో  చిరంజీవి తళుక్కున మెరిసారు. అలాగే రామ్ చరణ్ సినిమాలో బన్నీ కీలక పాత్ర ధరించారు. మొన్నటికి మొన్న మనం సినిమాలో అఖిల్ మెరుపులా మెరిసాడు. 

అదే విధంగా ముకుంద సినిమాలో మెగా హీరొలు ఎవరైనా కనిపించి వుంటే బాగుండేదంటున్నారు. దానికి సమాధానమా అంటూ మరి కొందరు మెగా అభిమానులు, ఇప్పుడు మెగా హీరోలు మనసు మార్చుకున్నారని, ఇకపై ఒకరి సినిమాకు మరోకరు ప్రమోట్ చేయరని, అలాగే ఫంక్షన్లకు కూడా హాజరు కాకూదని అనుకుంటున్నారని, కానీ అదే ఇతర హీరోల సినిమాలైతే మాత్రం బాగుంటే ప్రమోట్ చేస్తారని, ఫంక్షన్లకు కూడా వెళ్తారని అంటున్నారు. 

అంటే ఇంట్లో ఎలా వున్నా , వీధిలో గెలవాలనుకుంటున్నారన్నమాట మెగాహీరోలు.