త్రిపుర కు ఆ సినిమా మూలమా..కాపీనా?

కష్టపడి డైరక్టర్లం అయ్యాం..కింద నుంచి వచ్చాం..అని చెబుతుంటారు. కానీ పెద్ద డైరక్టర్లు ఫారిన్ సినిమాల్లోంచి సీన్లు లేపేస్తుంటే, చిన్న డైరక్టర్లు పక్క భాషా సినిమాల్లోంచి కానిచ్చేస్తుంటారు. త్రిపుర సినిమా ఓపెనింగ్ సీన్ లో అమ్మాయిని…

కష్టపడి డైరక్టర్లం అయ్యాం..కింద నుంచి వచ్చాం..అని చెబుతుంటారు. కానీ పెద్ద డైరక్టర్లు ఫారిన్ సినిమాల్లోంచి సీన్లు లేపేస్తుంటే, చిన్న డైరక్టర్లు పక్క భాషా సినిమాల్లోంచి కానిచ్చేస్తుంటారు. త్రిపుర సినిమా ఓపెనింగ్ సీన్ లో అమ్మాయిని చంపేసి, గోడకు కన్నం పెట్టి, లోపల శవం పెట్టి ప్లాస్టింగ్ చెసేస్తారు. ఆ సీన్ ఓ పాత సినిమాలోంచి కొట్టేసారని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

 ఆ మాటకు వస్తే, ఆ సీన్ మాత్రమే కాదు..సినిమా కాన్సెప్ట్ కూడా అక్కడ నుంచి కొంత తెచ్చుకుని, దెయ్యాన్ని జోడించారని వినికిడి.  1984లో నూరవ రోజు అనే డబ్బింగ్ సినిమా వచ్చింది. విజయకాంత్ , నళిని హీరో హీరోయిన్లు. ఆ సినిమాలో ఓపెనింగ్ సీన్లోనే అమ్మాయిని హత్య చేసి గోడలో పెట్టి, ఇటుకలు పేర్చి, ప్లాస్టింగ్ చేసేస్తాడు విలన్. ఆ సినిమాలో హీరోయిన్ కు కూడా కలలు వస్తుంటాయి. అవి నిజమవుతుంటాయి. అంతే కాదు..ఆ సినిమాకు, ఈ సినిమాకు చాలా సిమిలారిటీలు వుంటాయి, గమనిస్తే.

అయితే అది మర్టర్ సస్పెన్స్ థ్రిల్లర్..ఇది దెయ్యం థ్రిల్లర్. ఏం చేస్తాం..సబ్జెక్ట్ ల కొరత పీడిస్తోంది టాలీవుడ్ ను.