స్వామి రారా..కార్తికేయ సినిమాల్లో చాలా లవ్ లీగా, బబ్లీగా, కాలేజీ అమ్మాయిగా చాలా క్యూట్ గా కనిపించింది స్వాతి. ఆ పాత్రలు అలాంటివి కావచ్చు. కానీ త్రిపుర సినిమా దగ్గరకు వచ్చేసరికి మాత్ర పల్లెటూరి పాత్ర, పెళ్లయిన అమ్మాయి అనేమో గెటప్ చేంజ్ చేసేసారు. కానీ దాని వల్ల స్వాతి లుక్కేపోయింది.
పైగా ఆ కాస్ట్యూమ్స్ అంత లుక్ తో కనిపించలేదు. పైగా పల్లెటూరిలో లంగా వోణీల్లో కాస్త ఫ్యాటీగా కనిపించింది..చీరల్లోకి వచ్చి, జుట్టు పైకి దువ్వేసరికి ఆంటీ లుక్ వచ్చేసింది. ఇప్పుడిప్పుడే అటు తమిళ, మలయాళంతో పాటు తెలుగులో బాగానే వుంది కెరీర్. మరి కొన్నాళ్లు కాస్తయినా గ్లామర్ రోల్స్ వేస్తే బెటర్. పెర్ ఫార్మెన్స్ అవసరమే కానీ, అక్కడా కాస్త డ్రెస్ సెన్స్ చూసుకోవాలి కదా? మరీ సాదా సీదా చీరలు చుట్టబెడితే ఎలా?