బండ్ల గణేష్, పూరి జగన్నాధ్ కలిసి ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా ఆగిపోయిందంటూ వదంతులు పుట్టడం వెనుక చాలా వ్యవహారమే నడిచింది. ఈ వదంతులు ఏమీ అంత సులవుగా పుట్టలేదు. రభస సినిమా తరువాత ఎన్టీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. అలాంటి సమయంలో పూరి తో చేస్తున్న సినిమా కథపై దృష్టి పెట్టారు. అందులో హీరో పోలీస్ ఆఫీసర్ అని వినికిడి.
అదీ కాక, కళ్యాణ్ రామ్ చేస్తున్న షేర్, ఇప్పుడు వస్తున్న పవర్ సినిమాలతో దానికి పోలికలు కనిపించాయట. మరోపక్క ఆగడులో మహేష్ కూడా పోలీసే..వాటి సంగతి ఎలా వున్నా కథ మాంచి పవర్ ఫుల్ గా వుండకుంటే బతుకు బస్టాండయిపోతుందని ఎన్ట్ఆర్ భావించినట్లు బోగట్టా. అందుకే బ్రేక్ ఇచ్చి, కథపై మరోసారి కూర్చుందామని ఆయనే స్వయంగా సూచించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు ఆగదని, కానీ కథ మాత్రం మారుతుందని ఇప్పుడు రూఢిగా తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఈ సినిమా ఆగిందంటూ మీడియాకు ఉప్పందించింది రచయిత కోన వెంకట్ అట. పవర్ సినిమాకు సంబంధించి మీడియా సమావేశం దగ్గరకు వచ్చిన కోన వెంకట్ ఈ వైనం వెల్లడించడంతో ఆ వార్త గుప్పుమంది. అయితే కోనకు వక్కతంకు పడదని, అందుకే ఆయన ఇలా వార్త వెల్లడించారని వంశీ వర్గం చెబుతోంది. ఏదైనా అదేం ప్రారబ్దమో ఎన్టీఆర్ సినిమాకే ఇలాంటివి అన్నీ వస్తుంటాయి పాపం.