‘పవర్’ సినిమాని నిర్మించిన నిర్మాతకి, దానిని కొన్న బయ్యర్లకే కాదు… ఈ చిత్రంపై ఇంకా చాలా మందికి చాలా చాలా హోప్స్ ఉన్నాయ్. చిత్ర దర్శకుడు బాబీకి ఇదే ఫస్ట్ ఫిలిం. రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ ఈ చిత్రంతో ‘పవర్’ చూపించి సరాసరి అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోవాలని చూస్తున్నాడు.
ఇంతకాలం చిన్న హీరోల పక్కనే నటిస్తూ వచ్చిన రెజీనాకి ప్రమోషన్ దక్కడానికి ఇదే పెద్ద ఛాన్స్. రవితేజ సరసన హిట్టయితే రెజీనాకి మరికొందరు స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వస్తాయి. లేదంటే ఆమె ఎప్పటికీ సందీప్ కిషన్, అల్లు శిరీష్ రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
తమిళంలో టాప్‌కి చేరినా కానీ తెలుగులో మాత్రం ఏ లిస్ట్ చేరుకోలేకపోతున్న హన్సిక ‘పవర్’పైనే హోప్స్ పెట్టుకుంది. రెండు సినిమాల్లో పెట్టుకున్నట్టే పెట్టుకుని తీసేయడంతో బాగా హర్టయిన హన్సిక ఈ చిత్రంతో హిట్ కొట్టి వాళ్లు ఏం మిస్ అయ్యారో చూపించాలని తపించిపోతోంది. వీళ్లందరికే కాదు రవితేజకీ ఈ చిత్రం చాలా ఇంపార్టెంట్. బలుపు విజయం కేవలం వాపు కాదని, నిజంగా బలుపేనని నిరూపించుకోవడానికైనా ఇంకోసారి రవితేజ పవర్ చూపించక తప్పదు.