‘రభస’ చిత్రం కనుక అటు ఇటు అయితే ఎన్టీఆర్‌ని మీడియా రైట్ ఆఫ్ చేస్తుందని ఫాన్స్ వర్రీ అయ్యారు. వారు భయపడ్డట్టే రభస చిత్రం ఫ్లాపయింది. వారు కంగారు పడ్డట్టే మీడియా ఎన్టీఆర్‌ని టార్గెట్ చేస్తోంది. ఎన్టీఆర్‌ని నంబర్ వన్ రేసులోంచి తీసేయవచ్చునని, ఇక అతను ఫామ్‌లో ఉన్న ఇతర స్టార్లతో పోటీ పడలేడని తీసి పారేస్తోంది.
అయితే ఎన్టీఆర్‌లాంటి స్టార్‌కి ఈ పరాజయాలు అన్నిటినీ మరిపించడానికి ఒక్క హిట్ చాలు. పవన్‌కళ్యాణ్ పనైపోయిందని అనుకున్నప్పుడు అతను గబ్బర్‌సింగ్‌తో తనేంటో చూపించాడు. ఆ వెంటనే అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ హిట్టిచ్చాడు. పదేళ్ల తర్వాత కానీ పవన్‌ని వేధించిన పరాజయాలు వదిలిపోలేదు.
ఇక బాలకృష్ణకి ఇలాంటి బౌన్స్ బ్యాక్‌లు ఎన్ని ఉన్నాయో లెక్క లేదు. మహేష్‌బాబు సైతం దూకుడుకి ముందు చాలా స్ట్రగుల్ అయ్యాడు. అంతెందుకు అన్ని ఏళ్ల పాటు నంబర్‌వన్‌గా ఉన్న చిరంజీవికి కూడా అడపాదడపా స్లంప్‌లు వచ్చాయి. సూపర్‌స్టార్స్‌కి ఉండే అడ్వాంటేజ్ అదే. ఎన్ని దెబ్బలు తగిలినా ఒకే ఒక్క విజయంతో తిరిగి తమ స్థానాన్ని చేరుకుంటారు. ఎన్టీఆర్ కూడా త్వరలోనే తనేంటో నిరూపించుకుంటాడు. అందరి నోళ్లు మూయించేస్తాడు.
ఎన్టీఆర్‌కి వచ్చిన నష్టమేం లేదు!
‘రభస’ చిత్రం కనుక అటు ఇటు అయితే ఎన్టీఆర్‌ని మీడియా రైట్ ఆఫ్ చేస్తుందని ఫాన్స్ వర్రీ అయ్యారు. వారు భయపడ్డట్టే రభస చిత్రం ఫ్లాపయింది. వారు కంగారు పడ్డట్టే మీడియా ఎన్టీఆర్‌ని టార్గెట్…
Advertisement