మెగా హీరోని పూరీ చేతిలో పెడతారా?

వరుణ్‌ తేజ్‌ రెండో సినిమాకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తాడనే టాక్‌ బాగా వినిపిస్తోంది. ఇంకా అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి డీటెయిల్స్‌ తెలియలేదు కానీ వరుణ్‌ తేజ్‌ రెండో సినిమాకి పూరి…

వరుణ్‌ తేజ్‌ రెండో సినిమాకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తాడనే టాక్‌ బాగా వినిపిస్తోంది. ఇంకా అఫీషియల్‌గా ఈ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి డీటెయిల్స్‌ తెలియలేదు కానీ వరుణ్‌ తేజ్‌ రెండో సినిమాకి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువని మాత్రం చెప్పుకుంటున్నారు. 
    
వరుణ్‌ తేజ్‌ తొలి చిత్రానికి పలువురు దర్శకుల పేర్లు పరిశీలించినపుడు పూరి జగన్నాథ్‌ని కూడా కథ అడిగారు. రామ్‌ చరణ్‌ని పరిచయం చేసింది పూరి జగన్నాథ్‌ కనుక ఆ సెంటిమెంట్‌ ప్రకారం నాగబాబు అతడిని అప్రోచ్‌ అయ్యాడు. కానీ పూరి జగన్నాథ్‌ చెప్పిన కథలు నచ్చక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడితో ‘ముకుంద’ చేసారు. 
    
మొదటి సినిమాకి వద్దనుకున్న పూరీ ఇప్పుడు రెండో సినిమాకి మాత్రం ఎందుకు కావాల్సి వచ్చాడు? వరుణ్‌ తేజ్‌ రెండో సినిమాకి స్టార్‌ డైరెక్టర్లు ఎవరూ ఇమ్మీడియట్‌గా అందుబాటులో లేరు. పూరి అయితే వేగంగా సినిమా తీసిచ్చేస్తాడు… లక్కీగా అతనితో జాక్‌పాట్‌ వరుణ్‌కే తగిలితే హీరోగా మరో మెట్టెక్కేస్తాడు. అందుకే నాగబాబు ఇతనిపై మొగ్గు చూపుతున్నాడా? లేక ఇవి ఒట్టి గాలి వార్తలేనా?