పోర్న్‌స్టార్‌ని తీసుకొచ్చి తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడ్తున్నప్పుడు, వ్యభిచారం కేసులో బుక్కయినంతమాత్రాన ఓ హీరోయిన్‌పై చిన్నచూపు చూడటం తగదు కదా.! ఇదే విషయమై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘ఆమె అలా చేయడం తప్పు..’ అని ఇప్పటిదాకా కామెంట్స్ చేసినోళ్ళే, ఇప్పుడామెపై జాలి ప్రదర్శిస్తున్నారు.
పేరు అనవసరం. ఆమె నటిగా తొలి సినిమాతో మంచి మార్కులేయించుకుంది. ఆమె కెరీర్ మీద ‘వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ..’ అన్న ముద్ర పడిపోయింది. మామూలుగా అయితే, ఏ హీరోయిన్ కెరీర్‌కి అయినా తీవ్ర ప్రతిబంధకం. ఆమె ఆ రొంపిలోకి వెళ్ళడానికి గల కారణాల్ని అన్వేషిస్తే, ఎంతో కొంత ఆమెపై సానుభూతి కలగడం సహజమే. పైగా, పోర్న్స్టార్స్ని మన సినిమాల్లో ఎంకరేజ్ చేస్తోన్న రోజులివి.
వ్యభిచారం.. అనేదాన్ని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో అది ఆమె తొలి తప్పుగానో, తెలిసీ తెలియక చేసిన తప్పుగానో గుర్తిస్తే ఓ మహిళ మళ్ళీ సగౌరవంగా సమాజంలో తిరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులూ ఆ నటికి సంఫీుభావం తెలుపుతున్న దరిమిలా.. టాలీవుడ్ కూడా ఆమెకు అవకాశాలు కల్పించి, హీరోయిన్గా ఆమెను ప్రోత్సహిస్తారేమో వేచి చూడాలి.