ఆహా…ఏం క్రేజ్..సినిమాకు హైప్ అంటే ఇది కదా..రాష్ట్రంలో ఎన్ని స్క్రీన్ లు వున్నాయో అన్ని చోట్లా ఒకటే సినిమా. 24గంటల్లో ఎన్ని షోలు వేయగలరో అన్ని షోలు. అయినా టికెట్ లు కరువు. వెల్లువెత్తుతున్న జనం. ఏమిటీమాయ..బాహుబలికి అటు రూపకర్తలు, ఇటు మీడియా ఇచ్చిన హైప్ పుణ్యమా అంటూ వచ్చి పడిన క్రేజ్ ఇది. ఇదే ఇప్పుడు రాష్ట్రంలోని సినిమా అభిమానులను తీవ్ర గందరగోళానికి, కొండకచో నిరాశకు దారి తీస్తోంది.
డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్ వరకు ఎవరికి వారికి ఆబ్లిగేషన్లు పిచ్చేక్కించేస్తున్నాయి. నైజాం నిర్మాత దిల్ రాజు, ఈ ఆబ్లిగేషన్ల కారణంగా పాపం, సినిమా టికెట్ లను బ్లాక్ చేసుకుంటున్నాడన్న విమర్శలు ఎదుర్కోంటున్నారు.
రాజకీయనాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎవరికి వారు పదుల సంఖ్యలో టికెట్ లు అడుగుతున్నారు. తెలంగాణకుచెందిన కొందరు బడా రాజకీయ నాయకులు తమ తమ బంధుగణం కోసం, తమ తమ ఆబ్లిగేషన్ల కోసం తొలిరోజే స్పెషల్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో దిల్ రాజు తల పట్టుకోవాల్సి వస్తోంది. ఆఖరికి ఆయన అధికారికంగా లెటర్ ఇచ్చి మరీ మల్టీ ఫ్లెక్స్ టికెట్ లను తన కంట్రోల్ లో వుంచుకోవాల్సి వస్తోంది.
స్పెషల్ షోలు, మామూలు షోలు ఇలా ఒకటేమిటి? ఎన్నో. అయినా టికెట్ లు లేవు..లేవు..లేవు..ఈ లెక్కన స్పెషల్ షోలను పక్కన పెడితే, ఎన్ని స్క్రీన్ లు, ఎన్ని షోలు అన్నది లెక్కకు అందడం లేదు. వాటి కలెక్షన్లు ఎన్ని కోట్లు వుండోచ్చో లెక్కలకు అందడం లేదు. మరోపక్క టికెట్ ల సమస్య తీర్చలేక,వాటితో సంబంధం వున్నవారంతా ఫోన్ లు స్విచాఫ్ చేసుకుంటున్నారు.
టికెట్ లు బ్లాక్ చేయడం ఒక ఎఫెక్ట్. షో లకు షోలకు హైజాక్ చేసి, వేరే వాళ్లకోసం వేసుకోవడం వేరు. దానివల్ల షోకు అయిదారు వందల మంది కామన్ ప్రేక్షకులు టికెట్ తెచ్చుకునే పరిస్థితి కోల్పోతున్నారు. దీనివల్ల ఎక్కువ గడబిడ జరుగుతోంది. ఎప్పడూ కొత్త సినిమా చూడాలనుకున్న వారు మాత్రం సినిమాకు తొలి రోజు టికెట్ అందుకోకగలిగితే, ఈ థియేటర్లు సరిపోతాయి. కానీ ఈ స్పెషల్ బ్యాచ్ లుగా సినిమా చూడాలనుకోవడం వల్ల వస్తోంది అసలు సమస్య.