బాహుబలి..టికెట్ ల దందా

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నది సామెత. బాహుబలి హైప్ మల్టీఫ్లెక్స్ లకు తలకాయ నొప్పి తెస్తోంది. టికెట్ ల కోసం ఇంతా అంత డిమాండ్ కాదు. అది ఇప్పుడు ఏ రేంజ్ కు…

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నది సామెత. బాహుబలి హైప్ మల్టీఫ్లెక్స్ లకు తలకాయ నొప్పి తెస్తోంది. టికెట్ ల కోసం ఇంతా అంత డిమాండ్ కాదు. అది ఇప్పుడు ఏ రేంజ్ కు వెళ్లిందంటే తెలంగాణకు చెందిన ఓ కీలక రాజకీయ వేత్త, కమ్ మంత్రి, దాదాపు అన్ని మల్టీ ఫెక్స్ లకు అనుచరులతో వర్తమానం అందించారట. 

ప్రతి మల్టీఫ్లెక్స్ స్క్రీన్, ప్రతి ఆటకు రెండు టికెట్ ల వంతున తమకు కేటాయించాలని. మరి ఇది కేవలం తొలిరోజో, మరి మూడు రోజులో తెలియడం లేదు. దాంతో తప్పని సరై ఆ విధంగా సమర్పించుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.