మారుతి ఫిక్సయిపోయాడు

మారుతి స్వయంగా తన సంస్థపై డబ్ చేసిన సినిమా పాండవుల్లో ఒక్కడు.  వైభవ్ రెడ్డి నటించిన తమిళ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నాడు. ఒక విధంగా మారుతి గత చిత్రాల మాదిరిగా యూత్ ఫుల్ కామెడీ…

మారుతి స్వయంగా తన సంస్థపై డబ్ చేసిన సినిమా పాండవుల్లో ఒక్కడు.  వైభవ్ రెడ్డి నటించిన తమిళ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నాడు. ఒక విధంగా మారుతి గత చిత్రాల మాదిరిగా యూత్ ఫుల్ కామెడీ టైపు సినిమా ఇది. అయిదుగురు కుర్రాళ్లు, పెళ్లి వద్దనుకోవడం, కానీ తీరా ఒకడు పెళ్లి చేసుకోవాలనుకుంటే వచ్చిన ఇబ్బందులు, ఆపై పుట్టిన ఫన్. ఈ ఈసినిమాను ఈ నెల 24న విడుదల చేయాలని నిర్ణయించారు. 

బాహుబలి రిజల్ట్ కోసం చాలా సినిమాలు వేచి వున్నాయి. అందుకే దాని తరవాత ఓ వారం గ్యాప్ ఇచ్చిముందుగా మారుతి డేట్ ఫిక్సయిపోయాడు. అలాగే మారుతి బ్యానర్ పార్టనర్ గా అందించే మరో సినిమా కూడా 31కు ఫిక్సయిపోయింది. ఇంక జేమ్స్ బాండ్ డేట్ 16/17 అని అన్నారు కానీ, డవుటే. అది కూడా 24కు రావచ్చు. 

ఇవి కాక, రుద్రమదేవి, కిక్ 2, భలేభలే మగాడివోయ్ వుండనే వున్నాయి. కిక్ 2, భలేభలే మగాడివోయ్ సినిమాలు మాత్రం ఆగస్టు లోనే వస్తాయి. రుద్రమదేవి ఏం చేస్తుందో చూడాలి. శ్రీమంతుడు కు ముందా, వెనుకా అన్నది తెలియాలి.