ఆ ఫోటోలే దేశం పరువు తీస్తాయ్!

'నిర్భయ ఉదంతం గురించి బ్రిటన్ దేశీయులు రూపొందించిన డాక్యుమెంటరీ కాదు… బిహార్ లో పరీక్షల్లో కాపీల గురించి వెలుగులోకి వచ్చిన ఫోటోలే దేశం పరువును తీస్తాయి..' అంటూ సెటైరిక్ గా ట్వీట్ చేశాడు జమ్మూ…

'నిర్భయ ఉదంతం గురించి బ్రిటన్ దేశీయులు రూపొందించిన డాక్యుమెంటరీ కాదు… బిహార్ లో పరీక్షల్లో కాపీల గురించి వెలుగులోకి వచ్చిన ఫోటోలే దేశం పరువును తీస్తాయి..' అంటూ సెటైరిక్ గా ట్వీట్ చేశాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. 

'ఇండియన్ డాటర్' డాక్యుమెంటరీ విదేశాల్లో ఇండియా పరువు తీస్తుందని.. అలాంటి వీడియోల్లో వ్యక్తం అయిన అభిప్రాయాలు విదేశాల్లో భారత దేశంపై భయం కలిగిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఒమర్.. ఆ వివాదాన్ని బిహార్ పరీక్షల తీరు తెన్నులకు ముడిపెట్టాడు.

బిహార్ లో ఒక పరీక్ష సెంటర్ లో పరీక్ష రాస్తున్న వారికి కాపీలు అందిస్తూ గోడల కిటికీలు పట్టుకొని వేలాడిన వారి ఛాయచిత్రం ఇటీవల బాగా పాపులర్ అయ్యింది. అన్ని జాతీయ పత్రికలూ ఆ ఫోటోను పతాకశీర్షికలో అచ్చేశాయి. సూపర్ టైమింగ్ తో ఉన్న ఆ ఫోటో షాట్ బీహారీ పరీక్షల వ్యవస్థకు ఒక వెక్కిరింపులా ఉంది. ఈ నేపథ్యంలో ఒమర్ ట్వీట్ కూడా బాగానే పేలింది. ఇలాంటి పరీక్షల విధానం కూడా దేశానికి అవమానాన్ని కలిగించేదే.