మంచు వారి డైలాగు ఎవరిపైనో?

మంచు మనోజ్ హై ఓల్టేజీ సినిమా కరెంటు తీగ టీజర్ కమ్ ట్రయిలర్ వచ్చింది.సింగిల్ డైలాగైనా కాస్త ఆలోచించేదిగానే వుంది. 'చెట్టుపేరో, జాతిపేరో,  చెప్పుకుని మార్కెట్ లో అమ్ముడు పోవడానికి నేను కాయో, పండో…

మంచు మనోజ్ హై ఓల్టేజీ సినిమా కరెంటు తీగ టీజర్ కమ్ ట్రయిలర్ వచ్చింది.సింగిల్ డైలాగైనా కాస్త ఆలోచించేదిగానే వుంది. 'చెట్టుపేరో, జాతిపేరో,  చెప్పుకుని మార్కెట్ లో అమ్ముడు పోవడానికి నేను కాయో, పండో కాదు..కరెంటు తీగ..' ఇదీ ఆ డైలాగు. ట్రయిలర్ మాంచి ఎనర్జిటిక్ గా వుండడం సంగతి పక్క పెడితే ఈ డైలాగు ఏమిటని? 

సాధారణంగా మన హీరోల్లో నందమూరి వారే వంశం, స్కోత్కర్షలు సినిమాల్లో చొప్పిస్తుంటారు. మరి మనోజ్ జాతిపేరు, చెట్టుపేరు చెప్పుకుని మార్కెట్ చేసుకునే కాయను, పండును కాదు..కరెంటు తీగను అని అనడం వాళ్లమీదే పరోక్ష సెటైరా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టీజర్లు, ట్రయిలర్లు కాస్త సంచలనంగానే వుంటున్నాయి. వాటిల్లో ఇదొకటి.