ఒక్క సినిమా హిట్‌తో మళ్ళీ త్రిష తన రెమ్యునరేషన్‌ని పెంచేసిందట. ‘దమ్ము’ సినిమా తర్వాత త్రిషకి పెద్దగా తెలుగులో.. ఆ మాటకొస్తే తమిళంలోనూ సరైన అవకాశాల్లేకుండా పోయాయి. దాదాపు పదేళ్ళకుపైగానే హీరోయిన్‌గా కెరీర్‌లో ఓ వెలుగు వెలిగిన త్రిషకి, కెరీర్ పూర్తిగా డల్ అయిపోయింది నిన్నమొన్నటిదాకా. కానీ అనూహ్యంగా ఆమెకు మంచి హిట్ వచ్చింది.. అదీ సరైన టైమ్‌లో.
కన్నడలో త్రిష చేసిన ‘పవర్’ (తెలుగు ‘దూకుడు’కి కన్నడ రీమేక్) హిట్టవడంతో హీరోయిన్‌గా మళ్ళీ త్రిషకి డిమాండ్ పెరుగుతోందట సౌత్‌లో. ఆ మధ్య హిందీలో కూడా కాలు పెట్టినా, అక్కడ తొలి చిత్రమే ఫ్లాపయ్యేసరికి మళ్ళీ బాలీవుడ్ వైపు దృష్టి మళ్ళించలేదు త్రిష. ఎలాగైతేనేం.. రాక రాక వచ్చిన హిట్‌ని క్యాష్ చేసుకునే పనిలో త్రిష బిజీగా వుందిప్పుడు.
‘పవర్’ హిట్ అవడంతో, తెలుగు, తమిళ సినిమాల నుంచి ఆమెకు ఆఫర్లు దండగా వస్తున్నాయట. కన్నడలో అయితే అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్తుండడం గమనార్హం. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విషయం బాగా తెలిసిన త్రిష, ఆ దిశగా తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేసిందని కోలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.