చరణ్‌ బాబూ.. ఎందాకా వచ్చావ్‌?

అక్టోబర్‌ 1న విడుదల చేయడానికి పరుగులు పెడుతోన్న ‘గోవిందుడు అందరివాడేలే’కి డెడ్‌లైన్‌ దగ్గర పడుతోంది. ప్రస్తుతం జోర్డాన్‌లో ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఇంకా ఈ చిత్రం పూర్తి కావడానికి కాస్త సమయం అవసరమని…

అక్టోబర్‌ 1న విడుదల చేయడానికి పరుగులు పెడుతోన్న ‘గోవిందుడు అందరివాడేలే’కి డెడ్‌లైన్‌ దగ్గర పడుతోంది. ప్రస్తుతం జోర్డాన్‌లో ఒక పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఇంకా ఈ చిత్రం పూర్తి కావడానికి కాస్త సమయం అవసరమని తెలిసింది. సెప్టెంబర్‌ 25 నాటికి ఫస్ట్‌ కాపీ రెడీ అయితే తప్ప అక్టోబర్‌ 1 రిలీజ్‌కి మార్గం సుగమం కాదు. 

దసరా సీజన్‌ని మిస్‌ అయితే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సంక్రాంతి వరకు బెస్ట్‌ డేట్‌ లేదు. యువన్‌ శంకర్‌ రాజా ఇంకా పూర్తిగా పాటలు ఇచ్చినట్టు లేడు. మరి ఆడియో ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో, ఎప్పటికి పాటల చిత్రీకరణ పూర్తి చేస్తారో, అక్టోబర్‌ 1కి సినిమాని ఎలా సిద్ధం చేస్తారో అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. 

గోవిందుడు అందరివాడేలే కనుక దసరా బరి నుంచి తప్పుకుంటే ఆ టైమ్‌కి రిలీజ్‌ చేయడానికి పలు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. గోపీచంద్‌ లౌక్యం, వరుణ్‌ తేజ్‌ ముకుంద, నాగ చైతన్య ఒక లైలా కోసం… ఇలా చెప్పుకోతగ్గ చిత్రాలు చాలానే వెయిటింగ్‌లో ఉన్నాయి.