ఓవర్ సీస్ స్టామినా చాటుతున్న ఆగడు

తెలుగుసినిమా మార్కెట్ విస్తృతికి నిదర్శనంగా నిలుస్తోంది ఆగడు. గతంలో ఆంధ్ర, సీడెడ్, నైజాం.., ఆ తరువాత బెంగుళూరు వచ్చి చేరింది. తరువాత శాటిలైట్ ఓ ఆదాయ వనరుగా మారింది. పెద్ద సినిమా శాటిలైట్ హక్కులు…

తెలుగుసినిమా మార్కెట్ విస్తృతికి నిదర్శనంగా నిలుస్తోంది ఆగడు. గతంలో ఆంధ్ర, సీడెడ్, నైజాం.., ఆ తరువాత బెంగుళూరు వచ్చి చేరింది. తరువాత శాటిలైట్ ఓ ఆదాయ వనరుగా మారింది. పెద్ద సినిమా శాటిలైట్ హక్కులు రెండు చిన్న సినిమాల నిర్మాణ వ్యయం అంతగా మారాయి. తరువాత ఓవర్ సీస్ మార్కెట్ వచ్చింది. దీంతో ఇప్పుడు తెలుగు సినిమా ఆదాయాన్ని నైజాం..సీడెడ్..ఆంధ్ర..శాటిలైట్..ఓవర్ సీస్ అనే అయిదు రకాలుగా లెక్కేసుకునేందుకు వీలయింది. 

రాను రాను ఓవర్ సీస్ మార్కెట్ విస్తృతి పెరుగుతోంది. ఆగడు ఓవర్ సీస్ హక్కులు 9 కోట్ల మేరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఖర్చులు…అద్దెలు..అన్నీ లెక్కెసుకుంటే 12 నుంచి 13 కోట్ల మేరకు రావాల్సి వుంటుంది. ఆ పైన వచ్చేదే లాభం. అంటే 15కోట్ల వరకు రావాలి. 15కోట్లు అంటే ఓ ఎబౌ మీడియం సినిమా టొటల్ మార్కెట్ కింద లెక్క. కేవలం ఒక్క ఓవర్ సీస్ మార్కెట్ మాత్రమే ఓ మీడియం రేంజ్ భారీ సినిమా అంతకు చేరుకుంది. 

మహేష్ బాబు స్టామినా కూడా అలాగే వుంది. ఆగడు సినిమాకు మహేష్ రెమ్యూనిరేషన్ 16 కోట్లు అని వినికిడి. దీనికి తోడు డేట్లు తీసుకునే రూపంలో రమేష్ బాబుకు మరో రెండు కోట్లు అని టాక్. 18 కోట్లు ఇక్కడకే ఖర్చయిపోతాయి. అయితే అంతకు అంతా అమ్మాకాలు వుంటున్నాయి కాబట్టే నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. సరైన భారీ సినిమా 30 నుంచి 40కోట్లలో ప్లాన్ చేయాలే కానీ ఇవ్వాల్టి రేట్లలో మంచి లాభాలు కళ్ల చూడవచ్చు. కానీ మరీ తిక్కతిక్కగా ఏదో చుట్టేస్తే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరు.