విడిపోయారో..విడిగా వుంటున్నారో తెలియదు కానీ పవన్, రేణు దంపతుల మధ్య దూరం అయితే వుందన్నది వాస్తవం. ఆమె మహరాష్ట్రంలో, ఈయన తెలంగాణలో వుంటున్నారు. పవన్ ఈ విషయమై నోరు విప్పడం లేదు కానీ, రేణు మాత్రం వారానికి ఓ సారి పవన్ ను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రకటనలు చేస్తోంది. పవన్ ను పదే పదే గాలికి ఎత్తేస్తోంది. తాను తాజాగా నిర్మించిన సినిమా కు సంబందించిన ఏం అంశమైనా పవన్ కు ముడిపేట్టే మాట్లాడుతోంది. ఇప్పుడు అడియో ఫంక్షన్ వాయిదా పడి పవన్ బర్త్ డే నాడు జరపబోతుండడాన్ని కూడా అంత పెద్దగా చూపిస్తోంది. ఇది భగవంతుడి లీల అంటోంది.
అన్నీ బాగానే వుంది. మరి ఎందుకు దూరంగా వుంటున్నట్లో చెప్పదేమి? అందులో భగవంతుడి పాత్ర ఏమేరకు అన్నది వివరించదేమి? పవన్ ఇలా పదే పదే మంచి చేసుకునే వ్యవహారం చూస్తుంటే, దూరంగా వుండడంలో రేణు తప్పిదమే వున్నట్లు అనుమాన పడాల్సి వస్తోంది. నిజంగా పవన్ తప్పిదం వుంటే, ఈమె బిగుసుకు వుండడానికి అవకాశం వుంది. లేదూ, పవన్ దగ్గర డబ్బుంది అనుకుంటే, రేణు ఇప్పుడు వెళ్తున్న దారే ఆమె దృష్టిలో కరెక్ట్ కావచ్చు.