వచ్చిన వాళ్లందరికీ అన్నం పెట్టిన గొప్ప హీరో

బ్లాక్‌ అండ్‌ కాలంలో గొప్పగా వెలిగిన హీరో చిత్తూరు నాగయ్య. అప్పట్లో నటనతో పాటు గాయకుడిగానూ సత్తా చాటుకున్న ఆయన సంగీతం సమకూర్చడంలోనూ దిట్ట. 1940ల్లో సినిమాకు లక్షల్లో పారితోషికం తీసుకున్న స్టార్‌ హీరో…

బ్లాక్‌ అండ్‌ కాలంలో గొప్పగా వెలిగిన హీరో చిత్తూరు నాగయ్య. అప్పట్లో నటనతో పాటు గాయకుడిగానూ సత్తా చాటుకున్న ఆయన సంగీతం సమకూర్చడంలోనూ దిట్ట. 1940ల్లో సినిమాకు లక్షల్లో పారితోషికం తీసుకున్న స్టార్‌ హీరో చిత్తూరు నాగయ్య ఆయన సంపాదనతో పాటే వ్యయం కూడా రెట్టింపు ఉండేదట. 

ముఖ్యంగా ఆయన ఇంట్లో వచ్చే పోయే వాళ్లందరికీ నిత్యాన్న సంతర్పణ. పప్పు నుండి పచ్చళ్లతో సహా శ్రేష్ఠమైన నెయ్యితో భోజనం పెట్టి తన ఉదారతను చాటుకునేవాడట. అలా కొన్ని సంవత్సరాలు అదే దానం కొనసాగటంతో చిత్తూరు నాగయ్య ఆర్ధికంగా దెబ్బ తినాల్సి వచ్చిందట. 

హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చాలా తక్కువ రెమ్యునరేషన్‌కు కూడా నటించిన సందర్భాలు ఉన్నాయట. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర అన్నం తిన్న వాళ్లెవ్వరూ ఆదుకున్న పాపాన పోలేదట. యోగి వేమనగా నటించడమే కాదు. ఆ తత్వాన్ని ఒంట పట్టించుకున్న ఆయన ఆఖరి రోజుల్లో దుర్భర జీవితం అనుభవించి అస్తమించడం విచారకరం.