చిన్న సినిమాల్లో పెద్ద కమెడియన్లుగా మారిపోయారు సాయి, సప్తగిరి. వీరిలో సప్తగిరి చిన్న సినిమాల బ్రహ్మానందంగా పేరొందాడు. సాయి కూడా తక్కువోడేం కాదు. అయితే నటుడవుదామనుకోలేదట సాయి, సినీ రంగంలోకి వచ్చేటప్పుడు. దర్శకత్వ విభాగంలో పలు సినిమాలకు పనిచేసిన సాయి, ఎప్పటికైనా దర్శకుడిగా నిరూపించుకుంటానంటున్నాడు.
ఏదో లవ్ స్టోరీ, కాదంటే కమర్షియల్ మూవీ.. అన్నట్టు కాకుండా, పీరియాడికల్ బ్యాక్డ్రాప్ వున్న స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడట. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ అంటే ఆ కథ తెరకెక్కడానికి భారీగా బడ్జెట్ కావాల్సి వుంటుంది. ఎంతో టాలెంట్ వుంటే తప్ప, నిర్మాతను ఒప్పించడం కష్టం. అయినా సాధిస్తాననే ధీమాతో వున్నాడు సాయి.
మాటలు చెప్పడం తేలికేగానీ, సాయి మాటల్లో ఎంతోకొంత కాన్ఫిడెన్స్ అయితే కన్పిస్తోంది. ఏమో.. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు.? కమెడియన్గా సుపరిచితుడైన హర్షవర్ధన్, సినిమాలకు కథ, స్క్రీన్ప్లే అందిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోన్న విషయం విదితమే. సాయి కూడా దర్శకుడిగా రాణించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.