అన్నీ మన వేదాల్లోనే వున్నాయట అంటారు మనవాళ్లు..ప్రపంచ పరిశోధనలన్నీ భారతీయులు ఎప్పుడో చేసేసారని చెప్పడానికి. అలాగే వుంటుంది సినిమాల వ్యవహారం కూడా. తెలుగులో టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. మన వాళ్ల క్రియేటివిటీని తక్కువ అంచనా వేయడానికీ లేదు. ఇప్పుడు ప్రపంచం లోని భారతీయ ప్రేక్షకులను ఊపేస్తున్న పికే సినిమా వ్యవహారం చూడండి..మన రాఘవేంద్రుడు తీసిన జగదేకవీరుడు..అతిలోక సుందరి సినిమా కథ ఆలోచించండి. ఎన్ని పోలికలు కనిపిస్తాయో?
శ్రీదేవి పరలోకం నుంచి భూలోకం వచ్చి తన ఉంగరం కోల్పోతుంది. అది లేకుండా తిరిగి తన లోకానికి వెళ్లలేదు. ఇక్కడ ఓ దుష్ట మాంత్రికుడు వుంటాడు. వాడు ఆమెను బలివ్వాలనుకుంటాడు.. ఏం జరిగింది కథ.
పికె ఏమిటి? పరలోకం బదులు మరో గ్రహం నుంచి పికే భూమిపైకి వస్తాడు.. మళ్లీ వెనక్కు వెళ్లడానికి అవసరమైన రిమోట్ పొగొట్టుకుంటాడు. ఇక్కడా అమ్రేష్ పురి మాదిరిగా గుండు విలన్ లాంటి స్వామీజీ వుంటాడు..
అంటే ఒక్క లైన్ లో చెప్పాలంటే, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు అడ్వాన్స్ డ్ అండ్ ఇంటలెక్చ్యువల్ వెర్షన్ గా పీకెని చెప్పకోవచ్చు. అప్పటికి ఇప్పటికీ ప్రేక్షకులు పరిణితి చెందారు కాబట్టి, కాస్త డిస్కషన్ జోడించారు. మన సినిమా బి సి సెంటర్లను టార్గెట్ చేస్తుంది కాబట్టి, మాస్ ఫన్ జోడించారు,. కాస్త ఆలోచించండి,..మీకే తడుతుంది.