Advertisement

Advertisement


Home > Articles - Crime

మొబైల్ లో 300 మంది అమ్మాయిల వీడియోలు

మొబైల్ లో 300 మంది అమ్మాయిల వీడియోలు

ఓ చిన్న కేసులో ఓ దొంగ అరెస్ట్ అవుతాడు. లోతుగా విచారణ చేస్తే అతడు మామూలోడు కాదని అర్థమౌతుంది. ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేసిన దానికంటే కరడుగట్టిన హంతకుడు అని తేలుతుంది. చాలా కేసుల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది కూడా అలాంటి ఘటనే.

మైనర్ బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆగ్రాలోని సికింద్రా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ను చెక్ చేస్తే షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. ఏకంగా 300 మంది మైనర్లకు చెందిన మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు అందులో బయటపడ్డాయి.

ఇంతకీ ఎలా దొరికాడు...

స్థానిక పోలీస్ స్టేషన్ పరిథిలో ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది బాధిత బాలిక. ఆ అమ్మాయికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. 3 రోజుల పరిచయం తర్వాత, అమ్మాయికి చెందిన నగ్న వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నాయని, తనకు లొంగకపోతే అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించడం ప్రారంభించాడు.

బాధిత బాలిక స్థానికంగా ఉన్న ఎన్జీవోను ఆశ్రయించింది. ఎన్టీవో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అలా అరెస్ట్ అయిన వ్యక్తి ఫోన్ లో 300 మంది మైనర్ బాలికల వీడియోలు చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

ఒకడు కాదు.. ఏకంగా 30 మంది గ్యాంగ్

ఈ నెట్ వర్క్ లో వీడు ఒక్కడే కాదు, ఏకంగా 30 మంది గ్యాంగ్ ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ గ్యాంగ్ లో ఒకడు బాధిత బాలిక బాయ్ ఫ్రెండ్. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీడితో సదరు బాలిక కాస్త క్లోజ్ గా ఫొటోలు దిగింది. ఆ ఫొటోల్ని నెట్ వర్క్ లో ఉన్న వాళ్లంతా మార్ఫింగ్ చేసి పంపిణీ చేసుకున్నారు. ఇక అక్కడ్నుంచి బ్లాక్ మెయిల్ దందా షురూ అన్నమాట.

అలా ఇప్పటివరకు 250 మందికి పైగా విద్యార్థినుల్ని వీళ్లు బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. అయితే అందరూ మైనర్లు కావడంతో ఇంట్లో చెప్పడానికి, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. ఇన్నాళ్లకు ఈ గ్యాంగ్ పాపం పండింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?