Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రయోగాలు చేయాల్సిందే.. కానీ ఎలాంటివి?

ప్రయోగాలు చేయాల్సిందే.. కానీ ఎలాంటివి?

రొట్ట కొట్టుడు సినిమాల గురించి మనకు తెలిసిందే. మరోవైపు ప్రయోగాలు కూడా వస్తుంటాయి. రొట్ట కథలతో హిట్ కొట్టిన సినిమాలున్నాయి, అదే విధంగా ప్రయోగాలతో సక్సెస్ కొట్టిన మూవీస్ కూడా ఉన్నాయి. ఈ రెండు కరెక్టే. కొత్తదనం ఉన్న కథల్ని ఆదరించిన ప్రేక్షకులు, అదే చేత్తో పరమ రొటీన్ సినిమాలను కూడా హిట్ చేశారు. ఇక్కడ సినిమా పేర్లు అప్రస్తుతం.

అయితే ప్రతిదానికి ఓ లిమిట్ ఉంటుంది. రొటీన్ సినిమాలు హిట్టవుతున్నాయని, మరీ మూసలో వెళ్తే ఫ్లాప్ తప్పదు. అదే విధంగా ప్రయోగాలు క్లిక్ అవుతున్నాయని, మరీ వెగటు కలిగించే ప్రయోగాలు చేసినా ఇబ్బందే. తాజాగా వచ్చిన హంట్ సినిమా ఈ రెండో కేటగిరీకి చెందుతుంది.

సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా హంట్. మలయాళంలో హిట్ అయితే అదే మహాప్రసాదం అనుకుని తెలుగులో మక్కికిమక్కి దింపేసిన సినిమాల జాబితాలో ఇది కూడా ఉంది. డబ్బులున్నాయి కాబట్టి లావిష్ గా తీశారు, హాలీవుడ్ టెక్నీషియన్స్ ను పెట్టి ఫైట్స్ కంపోజ్ చేశారు. మరి కథ సంగతేంటి?

పదేళ్ల కిందకొట్టిన మలయాళ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయాలనుకోవడం తప్పులేదు. కానీ అందులో పాయింట్ తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా అవ్వదా అని ఆలోచించకపోవడం తప్పు. అక్కడ హిట్టయింది కాబట్టి ఇక్కడ కూడా హిట్టయిపోతుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా తీసినట్టున్నారు. తను ఓ పెద్ద ప్రయోగం చేశానని సుధీర్ బాబు గొప్పగా చెప్పుకోవచ్చు కానీ నిజానికి ఇది ప్రయోగం కాదు. ఇలాంటివి అసలు ప్రయోగాల కిందకు రావు.

హంట్ సినిమా క్లయిమాక్స్ లో సుధీర్ బాబు పోషించిన పాత్ర నిజంగానే ఓ సాహసం. అతడే చెప్పినట్టు తెలుగులో మరే హీరో ఈ పాత్ర చేసేంత ధైర్యం చేయడు. కాబట్టి సుధీర్ బాబు కూడా చేయకుండా ఉంటే బాగుండేది. కానీ చేశాడు, కోరి ఫ్లాప్ తెచ్చుకున్నాడు. ఇంత జరిగినా సుధీర్ బాబు పోషించిన ఆ పాత్ర ఏంటనేది ఇక్కడ చెప్పడం లేదు. ఎందుకంటే, అలా చెబితే స్పాయిలర్స్ ఇచ్చామంటూ మరో గోల.

ప్రయోగాలు చేస్తున్న టాలీవుడ్ మేకర్స్ కొందరు తమ పంథాను అదే విధంగా కొనసాగించాలి. అది ఇండస్ట్రీకి మంచిది కూడా. కానీ హంట్ సినిమాను చూసి ఎలాంటి ప్రయోగాలు చేయకూడదో కూడా తెలుసుకుంటే మంచిది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?