Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

కార్టూన్ స్టోరీ: సూపర్ రిచ్ సీఎం చంద్రన్నే!

కార్టూన్ స్టోరీ: సూపర్ రిచ్ సీఎం చంద్రన్నే!

చంద్రబాబునాయుడు... తాను రెండు ఎకరాల వ్యవసాయంతో జీవితం ప్రారంభించారని ఎన్నడో నోరుజారి చెప్పేశారు. అప్పటినుంచి ఆయన ఇప్పటి సంపద స్థాయికి ఎలా ఎదిగారంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేస్తూ ఆడిపోసుకుంటూ ఉంటారు. అదేముంది.. కుటుంబ వ్యాపారాలు నిలకడగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయి గనుక సంపద పెరుగుతోంది... అని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. అందుకోసమే ప్రతి ఏడాది వారి కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా ప్రకటిస్తూ ఉంటారు. 

అయితే ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ దేశంలోని అందరు ముఖ్యమంత్రుల సంపదల లెక్కతీసింది. వీరందరిలో చంద్రబాబునాయుడు టాప్ పొజిషన్ లో ఉన్నారు. చిట్టచివరి స్థానంలో త్రిపుర సీఎం, చేతగాని వాడని ఇప్పుడు మోడీ సర్కారు విమర్శలను భరిస్తూ ఎన్నికలను ఎదుర్కొంటున్న మాణిక్ సర్కార్ ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. చంద్రబాబునాయుడు దంపతుల ఆస్తులు 177కోట్లు. వారిని మించిన సీఎం ఈ దేశంలోనే లేరు. రెండో స్థానంలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ ఆస్తికంటె వీరిది ఇంచుమించు 50 కోట్లు ఎక్కువ. ఆయన ఆస్తి 129కోట్లే. 3వ స్థానం పంజాబ్ అమరీందర్ సింగ్ అయితే నాలుగోస్థానం కేసీఆర్ దే. వీరి ఆస్తులు వరుసగా 48, 15.5 కోట్లు. పూరెస్ట్ సీఎం మాణిక్ సర్కార్ 27లక్షల ఆస్తులే కలిగి ఉన్నారు.

మొత్తానికి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని నెంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువెళ్తా.. తీసుకువెళ్తా అని పదేపదే చెబుతూ ఉంటారు. అది సాధ్యమో కాదో తర్వాతి సంగతి.. సీఎంల సంపదలో మాత్రం ఆయన అందరికంటే నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నారు. తెలుగుజాతి మొత్తం గర్వించాల్సిన, ఆయనను అభినందించాల్సిన విషయం ఇది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?