Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

హవ్వ! గుదిబండ దించకుండానే.. పోరు మాటా!?!

హవ్వ! గుదిబండ దించకుండానే.. పోరు మాటా!?!

చంద్రబాబునాయుడు సరికొత్త ప్రహసనం షురూ చేశారు. ఈ ప్రహసనాన్ని ఆయన ఎన్నాళ్లు కొనసాగిస్తారో తెలియదు. ఏదో సాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఎన్డీయేలోకి వచ్చాం.. కానీ వారు ఏమీ చేయలేదు.. చాలా చులకనగా అవమానంగా మాట్లాడుతున్నారు. హోదా ఇవ్వం అని చెప్పడం ద్వారా మనల్ని కించపరిచేలా వ్యవహరించారు. ఇది తప్పు అని భావిస్తున్నాం. ఇక పోరాటం ఒక్కటే శరణ్యం అని చంద్రబాబునాయుడు సంకేతాలు ఇస్తున్నారు. ఆయన ఏం పోరాటాలు చేయదలచుకున్నారు.

కేవలం మంత్రిపదవులకు రాజీనామాలు చేశారే తప్ప.. ఎన్డీయే నుంచి తప్పుకోలేదు.

ఈ ప్రభుత్వం మీద ఆయన ఎలా పోరాడగలరు?

బంధాలను తెంచుకుంటే తప్ప.. పోరాడే తెగువ రావడం అసాధ్యం. చాలా చిన్న బంధాలుగా పరిగణించదగిన రెండు కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలు చేసి, అక్కడితో తాము పోరాటం చేసేస్తున్నట్టే అని చంద్రబాబునాయుడు ప్రజలను నమ్మించాలనుకుంటే ఎలాగ? ప్రజలు మరీ అంత వెంగళాయిల్లా కనిపిస్తున్నారా?

అసలు బధం సంకీర్ణంలో కొనసాగడంలో ఉంది. ఆ భారం చిన్నది కాదు. అసలు గుదిబండ అదే. దాన్ని దించుకోకుండా.. చంద్రబాబు పోరాటం పేరు చెబుతూ మభ్య పెడుతున్నారు.

చంద్రబాబు ఒక స్థాయి పనిచేస్తే దానికి పది రెట్లుగా ప్రచారం చేసిపెట్టడానికి పచ్చపత్రికలు సదా సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఆయన ఇంకా సంకీర్ణం నుంచి బయటకు రానేలేదు.. కేవలం పదవులను మాత్రం వదులుకున్నారు. అప్పుడే చంద్రభజన స్టార్ట్ అయిపోయింది. మోడీ సర్కారును ధిక్కరించి తొలిసారిగా బయటకు వచ్చారంటూ, చంద్రబాబును హీరో కింద ప్రొజెక్ట్ చేస్తూ అవాకులు చెవాకులు రాసేస్తున్నారు.

మరి సంకీర్ణంలోంచే బయటకు వచ్చేసిన శివసేన మాటేమిటి? శివసేన కూడా ఇప్పుడు చంద్రబాబుకు మద్దతు ప్రకటించడం లాగా కాకపోయినప్పటికీ.. ఆయన నిర్ణయం మోడీకి ప్రమాద సంకేతమే అని అంచనా వేస్తున్నది... కానీ చంద్రబాబే.. మోడీకి ఎలాంటి ప్రమాదమూ లేకుండా, నొప్పి తగలకుండా.. తన పోరాటం సాగించడానికి సంకీర్ణంలో కొనసాగుతున్నారని అనుకోవాల్సి వస్తుంది.

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?