Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'పాక్‌ అన్నదమ్ముల్లారా.. మీతో యుద్ధం చేస్తాం..'

'పాక్‌ అన్నదమ్ముల్లారా.. మీతో యుద్ధం చేస్తాం..'

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పాకిస్తాన్‌తో యుద్ధంపై ఎలా స్పందిస్తారా.? సరిహద్దుల్లో భారత బలగాలపై పాకిస్తాన్‌ సైన్యం, తీవ్రవాదుల్ని ఉసిగొల్పి, 20 మంది భారత సైనికుల్ని హతమార్చిన ఘటనకు ఎలా బదులిస్తారు.? పాకిస్తాన్‌కి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు.? ఈ ప్రశ్నల సగటు భారతీయుడ్ని వేధించేస్తూ వచ్చాయి. 

నిజమే మరి. సరిహద్దుల్లో కంటికి కునుకు లేకుండా 125 కోట్ల మంది భారతీయుల రక్షణమే తమ ధ్యేయంగా పనిచేస్తున్న భారత సైనికుల్ని, పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదులు హతమార్చారంటే, అది దేశంలో తీవ్రవాదులు సృష్టించిన ఘటనకన్నా ఎక్కువ ఆవేదనను రగుల్చుతుంది. పాకిస్తాన్‌పై బదులు తీర్చుకోవాల్సిందేనంటూ ప్రతి భారతీయుడి గుండె వేగం పెరిగింది. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిందేనని దేశమంతా నినదిస్తోంది. 

ఈ సమయంలో ప్రధాని నరేంద్రమోడీ నుంచి బాధ్యతాయుతమైన స్పందన వచ్చింది. కేరళలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. 'ఉరీ' ఘటనను మర్చిపోం.. అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు నరేంద్రమోడీ. అంతేనా, ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ ప్రజల్ని ఆలోచనలో పడేశాయి. 'పాకిస్తాన్‌ అన్నదమ్ముల్లారా.. మీతో మేం (భారతీయులం) యుద్ధం చేస్తాం.. ఇద్దరం యుద్ధం చేద్దాం.. పేదరికంపైన.. ఆకలి దప్పులపైనా..' అంటూ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు నరేంద్రమోడీ. యుద్ధంలో మీరు గెలుస్తారా.? మేం గెలుస్తారా.? యుద్ధానికి సన్నద్ధం కండి.. ఎవరు గెలుస్తారో తేలిపోతుంది.. అంటూ నరేంద్రమోడీ చేసిన ప్రసంగానికి భారతీయులైనా, పాకిస్తానీయులైనా.. నరేంద్రమోడీ ప్రసంగానికి 'సలాం' కొట్టాల్సిందే. 

ఆల్రెడీ బలూచిస్తాన్‌లో, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో నరేంద్రమోడీ ఇప్పటికే చాలామందికి 'హీరో' అయిపోయారు. అక్కడ నరేంద్రమోడీ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. భారత్‌ అనుకూల నినాదాలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా నరేంద్రమోడీ తన ప్రసంగంతో పాక్‌ ప్రజల్ని కట్టిపడేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 125 మంది భారతీయుల 'ఆవేశాన్ని' తగ్గించి, ఆలోచింపజేయగలిగారు. 

భారత్‌, పాక్‌.. రెండూ అన్వాయుధాలు కలిగిన దేశాలే. యుద్ధం జరిగితే ఆ తర్వాత జరిగే వినాశనం గురించి ఊహించడమే కష్టం. పాకిస్తాన్‌కి ఓటమి కొత్త కాదు. ఈసారీ ఓడిపోడానికి సిద్ధమే. కానీ, భారతదేశానికి ఎక్కువ నష్టం కలిగించాలనే 'శునకానందం' మాత్రం పాకిస్తాన్‌ సైన్యంలో, అక్కడి పాలకుల్లో కనిపిస్తుంది. అందుకే, కుక్క కాటుకి చెప్పుదెబ్బ గట్టిగానే తగలాలి. ఆ దెబ్బ కొట్టాల్సింది కూడా భారత్‌ కాదు, పాకిస్తాన్‌లోని ప్రజలే. మోడీ వ్యాఖ్యలతో పాకిస్తాన్‌ ప్రజలు పూర్తిగా మారిపోతారని అశించడం అత్యాశే అవుతుంది. కానీ, కాస్తయినా ఆలోచిస్తారు కదా. ఆలోచిస్తే, మోడీ వ్యూహం ఫలించినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?