శ్రీదేవి మరణం.. కుటుంబం పరిస్థితేంటి?

శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మరీ ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి ఇప్పుడే పరిశ్రమలోకి ఎంటర్ అయింది. ఎంతో శ్రద్ధ తీసుకొని కూతురును ఓ ప్రాజెక్టులో పెట్టి…

శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మరీ ముఖ్యంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి ఇప్పుడే పరిశ్రమలోకి ఎంటర్ అయింది. ఎంతో శ్రద్ధ తీసుకొని కూతురును ఓ ప్రాజెక్టులో పెట్టి హీరోయిన్ గా పరిచయం చేయాలనుకుంది శ్రీదేవి. అలా ధడక్ సినిమాలో జాన్వి నటిస్తోంది. ఆ సినిమా విడుదలకాకముందే శ్రీదేవి అనంతలోకాలకు వెళ్లిపోయింది. 

శ్రీదేవి మరణంతో జాన్వి తన తల్లితో పాటు ఓ మంచి మెంటర్ ను కోల్పోయినట్టయింది. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని దగ్గరుండి చూసిన శ్రీదేవి కంటే గొప్ప గైడ్ జాన్వికి ఎక్కడ దొరుకుతుంది. కథల ఎంపికలో శ్రీదేవి ఓ నిర్ణయం తీసుకుంటే అది వంద శాతం వర్కవుట్ అయ్యేది. వివిధ పరిశ్రమల నుంచి వచ్చిన 10 కథల్లో ఒకటి మాత్రమే సెలక్ట్ చేసుకొని, ఆ ఒక్క సినిమాతో సూపర్ హిట్ అందుకునేది శ్రీదేవి. ఆ అనుభవం ఇప్పుడు జాన్వికి అందకుండా పోయింది. 

ప్రస్తుతం జాన్వి ముంబయిలో ఏకాకిగా మిగిలిపోయింది. తల్లి లేదు. తప్పనిసరి పరిస్థితుల మధ్య తండ్రి దుబాయ్ లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం శ్రీదేవి బెస్ట్ ఫ్రెండ్, ధడక్ సినిమా నిర్మాత కరణ్ జోహార్ జాన్విని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అటు శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ పరిస్థితి కూడా ఇలానే తయారైంది. ఇంకా టీనేజ్ కూడా దాటని ఈ ఇద్దరు అమ్మాయిలకు తల్లి తోడు ఎంతైనా అవసరం. 

ఇప్పటికీ శ్రీదేవి భాతికకాయం ముంబయికి చేరలేదు. ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు వ్యక్తంచేసిన దుబాయ్ ప్రాసిక్యూషన్, శ్రీదేవి భర్త బోనీకపూర్ కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తోంది. హోటల్ సిబ్బందిని కూడా విచారణ చేస్తోంది. బోనీకపూర్ చెప్పిన సమాధానాలతో దుబాయ్ విచారణ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. 

మరోవైపు ఇలాంటి కేసుల్లో భౌతికకాయం భారత్ కు రావడానికి 2-3 రోజుల టైం పడుతుందని దుబాయ్ లోని భారతీయ కార్యాలయం ఓ ప్రకటన జారీచేసింది. వీలైనంత త్వరగా శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్ కు చేర్చేందుకు తమవంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ఎంబసీ తెలిపింది.