కమ్మని తెలుగుపాటల స్వరాభిషేకం

చికాగో: జూలై 29, 2014:  చికాగోలో తెలుగు ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు కళా వైభవంతో పాటు తెలుగు ఆట, పాట చికాగోలోని తెలుగు వారికి ఐక్యతను  మరోసారి చాటి చెప్పింది. చికాగో…

చికాగో: జూలై 29, 2014:  చికాగోలో తెలుగు ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు కళా వైభవంతో పాటు తెలుగు ఆట, పాట చికాగోలోని తెలుగు వారికి ఐక్యతను  మరోసారి చాటి చెప్పింది. చికాగో తెలుగు అసోషియేషన్ సీటీఏ తెలుగు  ఉత్సవం 2014 పేరిట నిర్వహించిన ఈ సంబరాలు ఆద్యంతం తెలుగు కుటుంబాలకు తియ్యటి అనుభూతులు మిగిల్చాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, సీటీఏలు సంయుక్తంగా ఈ ఉత్సవాన్ని దిగ్విజయం చేశాయి. 

తెలుగు ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా గాన గంధర్వుడు ఎస్.పి బాల సుబ్రమణ్యం, నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి, ఈటీవీ గ్రూప్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్  బాపినీడు కోనేరు, పీపుల్ టెక్ గ్రూపు మీడియా సీఈఓ విశ్వ ప్రసాద్,  ప్రముఖ గాయకులు మనో, సునీత, కల్పన, మాళవిక, ప్రణవి, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్,ఇండియన్ ఐడిల్ 5 విన్నర్  శ్రీరామ చంద్ర తదితర ప్రముఖులు విచ్చేశారు..

తెలుగు ఉత్సవం ప్రారంభమే ఎంతో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఉదయ బిందు, శ్రీ లలిత భమిడిపాటి  ప్రార్థన గీతం, రష్విక గొట్టిముక్కల ఆలపించిన అన్నమాచార్యుల కీర్తనలకు  స్థానిక కళాకారులు తమ నృత్య ప్రదర్శన జోడించి తెలుగు కళా వైభవాన్ని ఈ ఉత్సవ ప్రారంభంలోనే చూపించారు. సీటీఏ, నాట్స్ మహిళా విభాగం ఈ ఉత్సవాల విజయంలో కీలక పాత్ర పోషించింది. వారి ఆధ్వర్యంలో చిన్నారులచే ఏర్పాటు చేసిన  సాంస్కృతిక బృందం ఇచ్చిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి, సుజనా ఆచంట, రాణి వేగే, లోహిత తూనుగుంట్ల, రామ్ కొప్పాక, బిందు బాలినేని  లక్ష్మీ బొజ్జ, కళ్యాణి కోగంటి, రోజా చెంగలశెట్టి, కరిష్మా పిల్ల, హవిల్ల దేవరపల్లి, శైలజ పులవర్తి, భవానీ కారంపూడి, సంధ్య అంబటితో పాటు చాలా మంది మహిళా వాలంటీర్లు తెలుగు ఉత్సవంలో తమ విలువైన సేవలను అందించారు. సందీప్ కొరపాటి, బిందు బాలినేనిలు ఈ ఉత్సవానికి వ్యాఖ్యతలుగా వ్యవహారించారు. వేణు క్రిష్ణద్రుల, రామ్ తూనుగుంట్ట, ప్రణవ్ బేతపూడి, సందీప్ నన్నూరి వేదిక సమన్వయకర్తలుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు..

గత ఏడాడి సీటీఏ, నాట్స్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాల గురించి శ్రీనివాస బొప్పన్న వివరించారు. సీటీఏ, నాట్స్ సభ్యుల సహకారంతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించామని.. తెలుగు ఉత్సవాన్ని కూడా ఇంత బ్రహ్మండంగా చేయడంలో పాటు పడ్డ ప్రతి ఒక్కరికి సీటీఏ ప్రత్యేక అభినందనలు తెలుపుతుందన్నారు.  

సీటీఏ2014, నాట్స్ చికాగో టీమ్ లను సీటీఏ బోర్డ్ డైరక్టర్ రావు అచంట అందరికి పరిచయం చేశారు. సీటీఏ కార్యనిర్వహక అధ్యక్షుడిగా మూర్తి కొప్పాక,  ఉపాధ్యక్షులుగా మహేష్ కాకర్ల, రమేష్ మర్యాల, శ్రీథర్ ముమ్మనగండి, సుజనా అచంట,కార్యదర్శిగా మదన్ పాములపాటి,సంయుక్త కార్యదర్శిగా సుబ్బారావు పుట్రేవు, కోశాధికారిగా  వరప్రసాద్ బోడపాటి,  సంయుక్త కోశాధికారిగా లక్ష్మణ్ జీ కొల్లి కొనసాగుతారని వారందరిని సభావేదికపైకి రవి అచంట ఆహ్వానించారు. 2014లో చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు. నాట్స్ చికాగో టీమ్ సీటీఏకు అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు..నాట్స్ చికాగో చాప్టర్ టీం పరిచయ కార్యక్రమం జరగింది. నాట్స్ చికాగోచాప్టర్ కో ఆర్డినేటర్ గా  నాగేంద్ర వేగే,కార్యదర్శిగా రమేష్ మర్యాల, కోశాధికారిగా వరప్రసాద్ బోడపాటి, కోశాధికారితో పాటు సంయుక్త కార్యదర్శిగా రామకృష్ణ తూనుగుంట్ల ను తెలుగు ఉత్సవం సందర్భంగా  సభావేదికపైకి ఆహ్వనించారు. నాట్స్ తో కలిసి పనిచేసే అవకాశమిచ్చినందుకు నాట్స్ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరక్టర్లతో పాటు కొత్త కార్యనిర్వహక అధ్యక్షుడు మూర్తి కొప్పాక కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలుగువారికి ఉచిత వైద్య సేవలందించడంలో సీటీఏ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ డాక్టర్ పాల్ దేవరపల్లి సీటీఏ, నాట్స్ తో కలసి పనిచేసిన  తన అనుభవాలను పంచుకున్నారు. సీటీఏ బోర్డ్ ఆఫ్ డైరక్టర్  ప్రవీణ్ మోటూరి  తెలుగు ఉత్సవంలో ఉత్సాహంగా పనిచేసిన వారందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీటీఏ, నాట్స్  లక్స్యాలను ఆయన వివరించారు. నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటిని రవి అచంట వేదికపైకి ఆహ్వనించారు. సీటీఏ, నాట్స్ సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలు.. ఈ రెండు సంఘాల మధ్య ఉన్న అనుబంధం తెలుగువారి ఐక్యతను చాటుతుందని మధు కొర్రపాటి అన్నారు. తెలుగువారి కోసం సీటీఏ చేపట్టే ఏ కార్యక్రమానికైనా నాట్స్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రెండు సంఘాల సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. 

తెలుగు ఉత్సవం వేదికను మహిళ సీటీఏ, నాట్స్ టీంలు అత్యంత అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాయి. సుజనా అచంట, రాణి వేగే, లోహిత తూనుగుంట్ల, రమ కొప్పాక, బిందు బాలినేని, లక్ష్మి బొజ్జ, కల్యాణి కోగంటి, రోజా చెంగలశెట్టి, కరిష్మా పిల్ల,  హవిల్లా దేవరపల్లి, శైలజ పులవర్తి, భవానీ కారంపూడి, సంధ్య అంబటిలు మహిళా టీంలో కీలక పాత్ర పోషించారు. వీరందరిని మదన్ పాములపాటి, మూర్తి  కొప్పాక, ఫలలోచన వంకాయలపాటి, లక్ష్మణ్ జీ కొల్లి  చేతులు మీదుగా సత్కరించారు.

సీటీఏ, నాట్స్ వుమెన్ త్రో బాల్ క్రీడాకారిణులకు బహుమతులు అందజేత

సీటీఏ, నాట్స్ వుమెన్ త్రో బాల్ రన్నర్, విన్నర్ లకు తెలుగు ఉత్సవం వేదికగా బహుమతులు అందజేశారు. లక్ష్మి బొజ్జ, రాజేష్ వేదులముడి, శైలేంద్ర గుమ్మడి, మనోహార్ పాములపాటి, సుజనా అచంట, రాణివేగే, హవిల్లా మద్దెల, రోజా చెంగలశెట్టి, రమ కొప్పాక, బిందుబాలినేని, సుబ్బారావు పుట్రేవు చికాగో  వుమెన్ త్రో బాల్ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినందుకు నాట్స్, సీటీఏ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

వీనుల విందుగా స్వరాభిషేకం

తెలుగు ఉత్సవానికే స్వరాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తియ్యటి తెలుగు పాటలతో పాటు హూషారెత్తించే  సినీ గీతాలతో సాగిన స్వరాభిషేకం చికాగోలోని  తెలుగువారిని పాటల ప్రవాహంలో ముంచెత్తింది. పద్మభూషణ్ శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రమణ్యంతో పాటు మనో, సునీత, కల్పన, మాళవిక, ప్రణవి, వందేమాతం శ్రీనివాస్, శ్రీరామచంద్ర స్వరాభిషేకంలో తెలుగుపాటలతో హోరెత్తించారు..దాదాపు మూడు గంటల పాటు తెలుగు పాటల లోకంలో  చికాగో తెలుగు సంగీత ప్రవాహం తెలుగువారిని తన్మయత్వంలో ముంచెత్తింది. బాల సుబ్రమణ్యంతో పాటు గాయనీ గాయకులను సీటీఏ,నాట్స్ ఘనంగా సత్కరించింది.

వర ప్రసాద్ బోడపాటి, నిరంజన్ వల్లభనేని, మురళీ కలగర, మహేష్ కాకర్లతో కలిపి  ఏర్పాటు చేసిన వుడ్ కమిటీ..తెలుగువారిక  తెలుగింటి రుచులను అందించింది. నవీన్ అడుసుమిల్లి, రమేష్ మర్యాల, నవదీప్ దొప్పలపూడి  తయారుచేసిన రంగురంగుల సావనీర్ ను కూడా ఈ ఉత్సవం సందర్భంగా విడుదల చేశారు.
తెలుగు ఉత్సవానికి విచ్చేసిన వారికి దాతలకు, స్పాన్సర్స్ కు మదన్ పాములపాటీ సీటీఏ తరపున ధన్యవాదాలు తెలిపారు. సుబ్బారావు పుట్రేవు, హర్షవర్థన్ రెడ్డి, రాజేష్ వీధుల మూడి, మనోహార్ పాములపాటి, నిశాంత్, ప్రుద్వీ చలసాని, రామక్రిష్ణ తూనుగుంట్లలు అతిధులకు అతిధ్యం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. అరవింద్ ఐత, శ్రీధర్ అట్లూరి, అరవింద్ కోగంటి, మురళీ కోగంటి, వినోద్ కన్నన్, నవీన్ రెడ్డి, విజయ్ అరవింద్, ప్రణయ్ రాజ్ కుమార్ పిండి, శైలేంద్ర గుమ్మడి, లిమ్సన్ , హేమంత్ సింగ్, మహేష్ ఆళ్ల, నీల ఇమ్మాన్యూయేల్, పవన్ వల్లభనేని, విజయ్ వెనిగళ్ల, ప్రవీణ్ భూమన, అశోక్ పగడాల, రామక్రిష్ణ బాలినేని, శ్రీనివాస్ పిల్ల, రవికిరణ్, వెంకట్ యలమంచిలి, రవి చిగురుపాటి, శ్రీనివాస్ యార్లగడ్డ, వంశీ మన్నె, రామ్ గోపాల్ దేవరపల్లి, ఆదినారాయణ, సతీష్ యలమంచిలి,  అనిల్ కోదిండి, శ్రీనివాస్ పిడికిటి, నవీన్ అట్లూరి, శివ గొట్టి ముక్కల, అభి  అర్కట్, కిరణ్ అంబటి తదితరులు తమ విలువైన  సేవలు అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపింది.

ఫోటో లకు: 

https://www.flickr.com/photos/95055607@N08/sets/72157645471433184/