కొమ్మినేని: రాజకీయ పార్టీలకు ఉచితంగా భూములు ఇవ్వాలా!

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తున్నారా అన్న ప్రశ్న మనకు వస్తుంది. Advertisement గత ఎన్నికల సమయంలో ఒక రాజకీయ…

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ఖర్చులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి తెస్తున్నారా అన్న ప్రశ్న మనకు వస్తుంది.

గత ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ ఒక విద్యాసంస్థలో వందల కోట్ల రూపాయలు నిల్వ చేసి పంపిణీ చేసిందని వార్తలు వచ్చాయి. కాని అవే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల ఆస్తులను ఎలా వాడుకోవాలా అని చూడడం ఆసక్తికరంగా ఉంటుంది.

ఆం్రద్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలకు ఆఫీస్ ల నిమిత్తం భూములు ఇవ్వాలని ప్రభుత్వం నిర?యించడం విశేషం. నిజమే!ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు విశేష ప్రాదాన్యం ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేరు. కాని రాజకీయ పార్టీల పేరుతో ఏమి చేసినా చెల్లుతుందని అనే పరిస్థితి రావడం దురద ష్టకరం.

ఎపి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు ముప్పైమూడేళ్ల లీజుకు ఇచ్చే పద్దతిలో భూములు కేటాయించే విధానం విమర్శలకు గురి అవుతోంది. గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు సమానంగా భూములు కేటాయిస్తే ఎలా ఉండేదో. అలా కాకుండా అదికారంలో ఉన్నాం కదా అని తెలుగుదేశం పార్టీకి నాలుగు ఎకరాలు ఇచ్చేసుకున్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు  అర ఎకరం కేటాయించడంలో ఆంతర్యం అర్దం అవుతూనే ఉంది. బిజెపికి వెయ్యి గజాలు ఇస్తారు. శాసనమండలిలో బలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెస్ కు, సిపిఐ కి వెయ్యి గజాల చొప్పున ఇవ్వవచ్చు. సిపిఎం , ఇతర పార్టీలకు భూమి ఇవ్వరు.

ఈ రకంగా అధికార పార్టీకి మాత్రం అత్యధికంగా భూమి తీసుకుని మిగిలినవాటికి అతి తక్కువగా ఇవ్వడంలో హేతుబద్దత ఉందా అన్నది ఒక పాయింట్ అయితే అసలు ఎందుకు పార్టీలకు ఇంత పెద్ద ఎత్తున భూములు ఇవ్వాలి?గతంలో కూడా ఇచ్చారు కదా అన్న ప్రశ్న వస్తుంది. అది నిజమే కావచ్చు. అదైనా, ఇదైనా తప్పు కాదా?కాకపోతే అప్పట్లో ప్రభుత్వ భూములు ఉపయోగంలో లేనివాటిని కేటాయించేవారు. ఇప్పుడు అలా కాదు.రైతుల నుంచి తీసుకున్న భూములు ఇస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి.

రాజకీయ పార్టీలు సభ్యత్వం పేరుతో, ఇతరత్రా విరాళాల పేరుతో కోట్లు వసూలు చేస్తుంటాయి .ప్రతి సంవత్సరం జమాలెక్కలను ఎన్నికల సంఘానికి ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీకి వారు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఏభై కోట్ల రూపాయలకు పైగా నిల్వ ఉంది. అలాంటప్పుడు ప్రభుత్వ భూమికి ఎందుకు తాపత్రయపడాలి?అది కూడా రైతుల నుంచి రాజదాని కోసం తీసుకున్న భూమి కదా అని ఎవరైనా అడిగితే కేంద్రం లో కూడా ఇదే ప్రాదిపదికన ఇస్తారు కదా అని అదికారపార్టీ నేత కేశవ్ వాదిస్తున్నారు.

డిల్లీలో ఆయా పార్టీ లకు బంగళాలు కేటాయించి,తిరిగి ఎన్నికలైన తర్వాత సమీక్షిస్తుంటారు. దానిని బట్టి మార్పుతుంటారు. తెలుగుదేశం పార్టీ 197 లో ఈ విధానం ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీలకు సమానంగా భూమి ఇవ్వాలని నిర?యించింది. జిల్లాలలో ఇచ్చే ఆలోచన చేయలేదు. కాని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిలో, జిల్లాలలో కూడా భూములను తీసుకోబోతున్నారు.

అదికారంలో ఉన్నారు కనుక వారికి మంచి విలువైన భూములు వస్తాయి. మిగిలిన పార్టీలకు భూమి దొరికితే దొరుకుతుంది. లేకపోతే లేదు.గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో హుడా కు చెందిన భూమిని ఎన్.టి.ఆర్.ట్రస్టుకు బదలాయించుకున్న తీరు అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. మళ్లీ అదే పద్దతిలో విభజిత ఎపిలో కూడా భూములు పొందే వ్యూహరచన చేస్తున్నారు.

అందరూ ఒక ప్రశ్న అడుగుతున్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి అదికారంలోకి రాకపోతే ,అప్పుడు లెక్కల ప్రకారం భూములు మార్చుకునే అవకాశం ఉంటుందా అని? అది జరగే పని కాదు కనుక పార్టీ అద్యక్షుడుగా ఆయనే ఉంటారు ఆయన అదీనంలోనే ఆ భూమి అంతా ఉంటుంది. రాజదానికి ఇటుకలైనా విరాళాలు ఇవ్వాలని ఉదోేదించే ముఖ్యమంత్రి గారు తన పార్టీలో కోట్ల రూపాయల నిల్వ ఉన్నా, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో కోట్లు ఖర్చు చేస్తున్నా, పార్టీ ఆఫీస్ లకు మాత్రం ప్రభుత్వ స్థలాలను ఉచితంగా పొందాలని అనుకోవడం ఎలా సమర్ధించాలో అర్దం కాదు.

విపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ  ఇప్పటికే దీనిని భూ దోపిడీగా విమర్శించారు.వారు తమకు కేటాయించిన భూమిని తీసుకుంటారో లేదో తెలియదు. ఏది ఏమైనా చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ పద్దతిలో పెద్ద ఎత్తున  రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకుంటూ, ఇలా దాదాపు ఉచితంగా రాజకీయ పార్టీలకు పందారం చేయడం సమర్దనీయం కాదని చెప్పాలి. అయినా అదికారం తమ చేతిలో ఉంది కనుక భూములు తీసుకుంటారు.భవనాలు కట్టుకుంటారు. ఇదంతా తమ తెలివి అని సంతోషిస్తారు.

ప్రజలు వీటి గురించి ప్రశ్నించనంతకాలం ఇలాంటివి సాగిపోతూనే ఉంటాయి.

కొమ్మినేని శ్రీనివాస్ రావు , సీనియర్ జర్నలిస్ట్