కుక్క కావాలి.!

కుక్క పిల్లని ఎవరో భవనం మీద నుంచి కిందికి నిర్దాక్షిణ్యంగా విసిరేస్తే, ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది. సోషల్‌ మీడియాలో అందర్నీ కలచివేసిందా వీడియో. అదృష్టవశాత్తూ అంతెత్తు నుంచి కిందపడినా ఆ కుక్క…

కుక్క పిల్లని ఎవరో భవనం మీద నుంచి కిందికి నిర్దాక్షిణ్యంగా విసిరేస్తే, ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయింది. సోషల్‌ మీడియాలో అందర్నీ కలచివేసిందా వీడియో. అదృష్టవశాత్తూ అంతెత్తు నుంచి కిందపడినా ఆ కుక్క పిల్ల బతికి బట్టకట్టేసింది. ప్రస్తుతం దానికి వైద్యం జరుగుతోంది. 

ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇఫ్పుడా కుక్క సెలబ్రిటీ అయిపోయింది. అంతేనా, సెలబ్రిటీల్ని ఎట్రాక్ట్‌ చేస్తోంది. సింగర్‌ చిన్మయి ఆ కుక్క పిల్లను దత్తత తీసుకుంటానని ప్రకటించేసింది. ఇంకోపక్క, హీరోయిన్‌ త్రిష కూడా ఆ కుక్క పిల్ల విషయంలో సీరియస్‌గా స్పందించింది. నిర్దాక్షిణ్యంగా భవనం మీద నుంచి కిందికి దాన్ని విసిరేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. 

అందరికీ తెల్సిన విషయమే కదా, త్రిషకి కుక్క పిల్లలంటే ఎంతో ఇష్టమని. అందునా వీధి కుక్కల్ని సంరక్షించడంలో త్రిష తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది. అన్నట్టు, ఈ 'సెలబ్రిటీ కుక్క పిల్ల' కోసం చాలామంది ప్రముఖులు, దానికి వైద్య చికిత్స అందించి, సపర్యలు చేస్తున్న వ్యక్తి ఇంటివద్ద క్యూ కట్టేస్తున్నారట. ఏంటో, పాడు లోకం.! ఓ పక్క మానవత్వం మంటగలిసిపోయి, సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంటే, కుక్క పిల్ల కోసం ఇంత హంగామా.? 

కుక్క పిల్ల అని తేలిగ్గా తీసి పారెయ్యలేం.. ఎందుకంటే, జంతువులకీ హక్కులుంటాయ్‌. అందుకే మరి, ఈ కుక్క పిల్ల సెలబ్రిటీ అయిపోయింది. ఎనీ డౌట్స్‌.?