షరపోవా.. ఇలా షాకిచ్చావేంటి..!!!

ప్రపంచ టెన్నిస్ అభిమానుల ఆరాధ్య దేవత… Advertisement ఆటతోనే గాక అందంతోనూ అభిమానులను కలిగిన అపరంజి..  అన్నా కోర్నికోవాకు సిసలైన వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ రష్యన్ భామ ఆమెను మైమరపించింది… కోర్నికోవా ప్రపంచ…

ప్రపంచ టెన్నిస్ అభిమానుల ఆరాధ్య దేవత…

ఆటతోనే గాక అందంతోనూ అభిమానులను కలిగిన అపరంజి.. 

అన్నా కోర్నికోవాకు సిసలైన వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ రష్యన్ భామ ఆమెను మైమరపించింది…

కోర్నికోవా ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని భగ్నహృదయులను చేసి తెరమరుగు కాగా.. షరపోవా మాత్రం తన ఆటతో అంతులేని వినోదాన్ని అందించింది…

ఇది కేవలం షరపోవా కెరీర్ కే కాదు.. ప్రపంచ టెన్నిస్ అభిమానులందరికీ పెద్ద షాక్. తను నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్టుగా షరపోవా ధ్రువీకరించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత జరిగిన డోప్ టెస్టుల్లో తేలినది వాస్తవమేనని ఆమె స్పష్టం చేసింది. దీనికి నవ్వుతూ క్షమాపణలు కోరింది ఈ సైబీరియన్ సుందరి. ప్రపంచానికి ఆరాధ్యులుగా నిలిచిన కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ వివాదాలను ఎదుర్కొనడం కొత్తేమీ కాదు! అలాంటి లెజెండరీల సరసనే షరపోవా కూడా స్థానం సంపాదించింది.

డిగో మారడోనా.. మైక్ టైసన్, ఆర్మ్ స్ట్రాంగ్ ల వంటి వారి తీరునే షరపోవా క్రీడా జీవితం వివాదాల పాలవుతోంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య షరపోవాపై తాత్కాలిక నిషేధం విధించింది. ప్రతియేటా కోట్ల రూపాయలు చెల్లించి షరపోవాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండిన నికే ఒప్పందాలను రద్దు చేసుకుంది! 

అయితే.. ప్రస్తుతానికి షరపోవా మాత్రం ఢీలా పడినట్టుగా కనిపించడం లేదు. క్షమాపణలు చెప్పేసింది. ఇక్కడ షాక్ అంతా అభిమానులకే! షరపోవా ఎదుర్కొనబోయే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో మరి.