శ్రీదేవి మరణంపై టీవీ ఛానెళ్లలో భిన్న కథనాలు ప్రసారమవుతున్నాయి. ఛానెళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దుబాయ్ అధికారులు పోస్టుమార్టం నివేదికను భారత అధికారులకు అందచేశారు. దానిప్రకారం ఆమె గుండెపోటుతో చనిపోలేదని, స్నానాల గదిలోని బాత్ టబ్‌లో మునిగి మరణించిందని తెలుస్తోంది.
ఆమె మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని డాక్టర్లు చెప్పారని సమాచారం. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన శ్రీదేవి చాలాసేపటివరకు బయటకు రాకపోవడంతో భర్త బోనీ కపూర్, అక్కడ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టారని, బాత్ టబ్‌లో పడున్న శ్రీదేవిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. శ్రీదేవి గుండెపోటుతోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో ఉందని ఓ తెలుగు ఛానెల్ తెలిపింది.
మరో తెలుగు ఛానెల్ ఆమె మరణంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయంటూ కథనం ప్రసారం చేసింది. మరిది సంజయ్ కపూర్‌ను బోనీ కుటుంబ సభ్యులు మాట్లాడనివ్వడంలేదంటూ పేర్కొంది. వారు అసలు ఏం జరిగిందన్నదానిపై నోరు విప్పడంలేదని తెలిపింది. బోనీపై అనుమానాలు వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు.
బాత్‌టబ్‌లో పడిపోతే ప్రాణం పోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె బాత్ టబ్‌లోని నీళ్లలో మునిగి చనిపోయిందని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. సంజయ్ కపూర్ ఆదివారం దుబాయ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమెకు గుండెకు సంబంధించిన వ్యాధి ఏమీ లేదని, గుండెపోటుకు సంబంధించిన మెడికల్ హిస్టరీ లేదని చెప్పారు.
హార్ట్ అటాక్‌కు సంబంధించిన లక్షణాలు. సంకేతాలు లేవు కాబట్టే ఆ కారణంగానే మరణించిందని డాక్టర్‌లు చెప్పగానే తాము షాక్‌కు గురయ్యామని సంజయ్ కపూర్ చెప్పారు. ఆమె హోటల్ గదిలో శనివారం రాత్రి 11గంటల సమయంలో వెంటనే ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయారని డాక్టర్లు చెప్పారు. దుబాయ్‌లో జరిగిన పెళ్లి వేడకల్లో ఆమె చాలా హుషారుగా, అందంగా, మెరిసిపోతూ కనిపించింది.
ఈ వీడియోలు, ఫోటోలు టీవీ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె అనారోగ్యంతో ఉన్న ఛాయలూ కనిపించలేదు. ఇక ఆమె రక్తంలో ఆల్కహాల్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. డిన్నర్ చేయడానికి ముందు భర్తతో కలిసి ఆల్కహాల్ సేవించిందని, అయితే అది ఎక్కువ మోతాదులో తీసుకొని ఉండవచ్చని వైద్యులు చెప్పారు.
బరువు తగ్గడానికి, సౌందర్య రక్షణకు ఆమె ఎప్పటినుంచో సర్జరీలు చేయించకుంటోంది. మందులు వాడుతోంది. అయితే ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి. ఈ పనులు చేసేవారు రోజూ కొంతమేరకు ఆల్కహాల్ తీసుకోవాలని వైద్యులు చెప్పారట. రోజూ పరిమితంగా ఆల్కహాల్ తీసుకునే శ్రీదేవి చనిపోయినరోజు ఎక్కువ మోతాదులో సేవించిందని ఓ ఛానెల్ కథనం. పోస్టుమార్టం నివేదికలో తప్పులున్నాయని ఆ ఛానెల్ పేర్కొంది. ఏది ఏమైనా శ్రీదేవి మరణం కొంతకాలం చర్చనీయాంశమయ్యే అవకాశముంది.