సూరె కుటుంబానికి అండగా నాట్స్

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తన మానవత చాటుకుంది. కృష్ణమూర్తి సూరె కుటుంబానికి నేనున్నాంటూ భరోసా ఇచ్చింది. ఆర్థికంగా చేయూత అందించింది. ఇటీవలే న్యూజెర్సీ ఎడిషన్…

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తన మానవత చాటుకుంది. కృష్ణమూర్తి సూరె కుటుంబానికి నేనున్నాంటూ భరోసా ఇచ్చింది. ఆర్థికంగా చేయూత అందించింది. ఇటీవలే న్యూజెర్సీ ఎడిషన్ లో  క్యాన్సర్ తో సాప్ట్ వేర్ ఉద్యోగి కృష్ణమూరి సూరె (భరణి) మరణించారు. సాధారణ మధ్యతరగతికి చెందిన కృష్ణమూర్తి సూరె భార్య, ఇద్దరు పిల్లలతో ఎడిషన్ నివసిస్తుండేవారు. కానీ క్యాన్సర్ అతని ప్రాణాలను హరించింది. 

సూరె కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సూరె కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో సూరె కుటుంబానికి నాట్స్ మద్దతుగా నిలిచింది.  మానవతావాదులు సూరె కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వాలని పిలుపునిచ్చింది. నాట్స్ పిలుపుకు చాలా మంది దాతలు కదిలివచ్చారు. తమకు తోచిన విరాళాలు అందించారు. 

ఇలా సేకరించిన 62780 డాలర్ల విరాళాన్ని చెక్కు రూపంలో నాట్స్  సూరె కృష్ణమూర్తి( భరణి)  భార్య కుమారి కు  అందించింది.  ఈ మొత్తాన్ని పిల్లల చదువు వినియోగిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చింది.  అమెరికాతో తెలుగువారికి అండగా ఉంటుందనే విషయం నాట్స్ ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువుచేసింది.