వాజ్‌పాయి, మాలవీయకి భారతరత్న

మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పాయికి భారత దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతర్న’ వరించనుంది. వాజ్‌పాయితోపాటు, విద్యావేత్త మదన్‌ మోహన్‌ మాలవీయకూ భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌…

మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పాయికి భారత దేశంలోని అత్యున్నత పురస్కారమైన ‘భారతర్న’ వరించనుంది. వాజ్‌పాయితోపాటు, విద్యావేత్త మదన్‌ మోహన్‌ మాలవీయకూ భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. కాస్సేపటి క్రితం భేటీ అయిన కేంద్ర క్యాబినెట్‌, ఈ వాజ్‌పాయి, మాలవీయలకు భారతరత్న పురస్కారం ఇచ్చే దిశగా ఆమోద ముద్ర వేసింది. క్యాబినెట్‌ ఆమోదం అనంతరం, రాష్ట్రపతికి సంబంధిత దస్త్రం చేరగా, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, క్యాబినెట్‌ సిఫార్సుకు ఆమోద  ముద్ర వేశారు.

ప్రధానమంత్రిగానూ, బీజేపీ నేతగానే కాక, యువతకు మార్గదర్శిగా అటల్‌ బిహారీ వాజ్‌పాయి నిలిచారు. ఆయన హయాంలో దేశం అభివృద్ధి పథాన నడిచిందన్నది కాదనలేని వాస్తవం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడ్తోన్న వాజ్‌పాయి, పార్టీ కార్యకలాపాలకూ దూరంగా వుంటున్నారు. రేపు ఆయన జన్మదినం.

ఇదిలా వుంటే, మదన్‌ మోహన్‌ మాలవీయ, అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. స్వాతంత్ర సమరయోధుడైన మాలవీయ, స్వతంత్ర పోరాటంలో సామాన్యుల్ని భాగస్వామ్యులుగా చేయడంలో తనదైన పాత్ర పోషించారు. ఓ వార పత్రికను ఆయన నడిపారు. విద్యావేత్తగానూ ఆయన గుర్తింపు పొందారు.