రాకింగ్ రెడ్డి: అర్జున్ రెడ్డికి కాసుల పంట

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా వరుసగా రెండో వారం కూడా తన డ్రీమ్ రన్ కొనసాగించింది. మినిమం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ…

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా వరుసగా రెండో వారం కూడా తన డ్రీమ్ రన్ కొనసాగించింది. మినిమం బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, నైజాంలో విడుదలైన ఈ 14 రోజుల్లో ఏకంగా 15కోట్ల రూపాయల షేర్ సాధించింది. అటు ఓవర్సీస్ లో కూడా తగ్గట్లేదు అర్జున్ రెడ్డి. ఈ 2 వారాల్లో 5కోట్ల 35లక్షల షేర్ సాధించింది.

ఓవైపు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే మరోవైపు రీమేక్ రైట్స్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది ఈ సినిమా. ఇప్పటికే ఈ మూవీ తమిళ రీమేక్ రైట్స్ ను ధనుష్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కన్నడ రీమేక్ రైట్స్ ను రాక్ లైట్ వెంకటేష్ దక్కించుకున్నారు. హిందీ రీమేక్ రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో అర్జున్ రెడ్డి 2 వారాల వసూళ్లు (షేర్)

నైజాం – 7.95 కోట్లు
సీడెడ్ – 1.95 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.26 కోట్లు
ఈస్ట్ – 91 లక్షలు
వెస్ట్ – 54 లక్షలు
కృష్ణ – 1.01 కోట్లు
గుంటూరు – 1 కోటి
నెల్లూరు – 38 లక్షలు

ఏపీ, నైజాం 14 రోజుల షేర్ – 15 కోట్లు