పూరి ఖాతాలో ఎంతమంది హీరోలో..!

ఇషాన్, బాలకృష్ణ, ఆకాష్, రవితేజ, చిరంజీవి, మహేష్, వెంకటేశ్… ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు హీరోల పేర్లు పూరి లిస్ట్ లో ఉన్నాయి. వీళ్లలో ఎంతమంది ఈ దర్శకుడితో సినిమా…

ఇషాన్, బాలకృష్ణ, ఆకాష్, రవితేజ, చిరంజీవి, మహేష్, వెంకటేశ్… ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు హీరోల పేర్లు పూరి లిస్ట్ లో ఉన్నాయి. వీళ్లలో ఎంతమంది ఈ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం పూరి పేరు చుట్టూ వినిపిస్తున్న హీరోల లిస్ట్ ఇది.

పైసా వసూల్ తర్వాత బాలయ్యతో మరో సినిమా ఉంటుందని ప్రకటించాడు పూరిజగన్నాథ్. ఈ విషయాన్ని బాలకృష్ణ కూడా నిర్థారించాడు. వీలైతే బాలయ్య 103వ సినిమాను పూరి డైరక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

అయితే బాలకృష్ణతో సినిమా కంటే ముందే కొడుకు ఆకాష్ ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని ప్రకటించాడు పూరి. అక్టోబర్ నుంచే ఈ సినిమా మొదలవుతుందని కూడా తెలిపాడు. సో.. ఆకాష్ సినిమా తర్వాత బాలయ్యతో మూవీ ఉండొచ్చు.

ఇక పూరి లిస్ట్ లో మహేష్, రవితేజ పేర్లు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. మహేష్ సినిమాకు జనగణమన అనే టైటిల్ కూడా పెట్టేశాడు పూరి. అటు రవితేజ కోసం మరో మాస్ మసాలా స్టోరీ సిద్ధంచేశానని కూడా ప్రకటించాడు. ఈ రెండు సినిమాల్లో రవితేజ సినిమా ఎప్పుడైనా ఓకే అవ్వొచ్చు. ఎటొచ్చి మహేష్ తో చేయాల్సిన సినిమానే డౌట్.

అటు వెంకటేశ్, చిరంజీవి పేర్లు కూడా చెబుతున్నాడు ఈ డైరక్టర్. చిరంజీవితో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తానని, 3నెలల కిందట మెగాస్టార్ కు మరో స్టోరీలైన్ కూడా వినిపించానని ప్రకటించాడు. అటు వెంకటేష్ కూడా పూరితో ఓ సినిమా చేస్తానని, ఎప్పుడు చేస్తానో చెప్పలేనని అంటున్నాడు.

వీళ్లతో పాటు ‘రోగ్’ హీరో ఇషాన్ కు ఇంకో మూవీ బాకీ ఉన్నాడు ఈ దర్శకుడు. రోగ్ సినిమా టైమ్ లోనే కుదిరిన 2 సినిమాల ఒప్పందం ఇది. ఇలా పూరి ఖాతాలో చాలామంది హీరోలు ఉన్నారు. ప్రస్తుతం వరుస ఫ్లాపులిస్తున్న ఈ దర్శకుడితో వీళ్లలో ఎంతమంది సెట్స్ పైకి వెళ్తారో చూడాలి.