ఎస్ ఎస్ టు ఎస్ ఎస్: దర్శకుడు త్రికోటితో చిట్ చాట్

ఈగ, లెజండ్..భారీ సినిమాలు అందాల రాక్షసి, ఊహలు గుసగుసలాడే..చిన్న సినిమాలు డిఫరెంట్ స్ట్రాటజీ నిర్మాత కొర్రపాటి సాయిది. వెనకాల అండాదండా అందించే రాజమౌళి వున్నాడనే ధైర్యమో ఏమిటో?  Advertisement నిజమే బ్యానర్ కు వారాహి…

ఈగ, లెజండ్..భారీ సినిమాలు
అందాల రాక్షసి, ఊహలు గుసగుసలాడే..చిన్న సినిమాలు
డిఫరెంట్ స్ట్రాటజీ నిర్మాత కొర్రపాటి సాయిది. వెనకాల అండాదండా అందించే రాజమౌళి వున్నాడనే ధైర్యమో ఏమిటో? 

నిజమే బ్యానర్ కు వారాహి అని నామకరణం చేసినప్పటి నుంచి ఇప్పటి సినిమా దాకా అన్నింటికి వెన్నంటే వుంటారు దర్శకుడు రాజమౌళి. ఆ బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా 'దిక్కులు చూడకు రామయ్యా'. దీనికి ఏకంగా దర్శకుడినే తన స్కూలు నుంచి అందించారు. పేరు త్రికోటి. చూస్తే దర్శకుడిలా వుండడు..ప్రొడక్షన్ బాయ్ అనుకుంటారు. అనుకోవడం ఏమిటి? ప్రొడక్షన్ బాయ్..జీవితపు ప్రారంభంలో. ఇప్పుడు దర్శకుడు. మహా మహా మహానుభావులే క్లాప్ బాయ్ లుగా, థియేటర్ గేట్ మన్ లుగా ప్రారంభించి సినిమా హిస్టరీలో మిగిలిపోలేదా? ఏమో ఈ త్రికోటి ఏం చేస్తాడో. ఆయనతో 'గ్రేట్ ఆంధ్ర' చిట్ చాట్.

పేరేమిటి చిత్రంగా వుంది.

నిజానికి నా పేరు పి కోటి. కానీ దేనికీ కలిసిరావడంలా..అయిదు ఆరు సినిమాలు చేతివేళ్ల చివరి దాకా వచ్చి జారిపోయాయి. మా కులదైవం కోటప్ప కొండ త్రికోటీశ్వరస్వామి. కోటయ్య స్వామీ అంటారు. అందుకే కోటిని త్రికోటి అయ్యాను.

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీనా..ఫార్టీ ఇయర్సా..

అంత లేదని అనలేను.కానీ ప్రారంభించింది ప్రొడక్షన్ బాయ్ గా. లక్ష్మీఫిలింస్ లింగమూర్తిగారి టైమ్ నుంచి. కెఎస్ రామారావు గారి దగ్గర వుండేవాణ్ణి

మరి ఇటెలా వచ్చారు

అందర్నీ చూసాక నాకు ఈ రంగంలోకి రావాలనిపించింది. ఆ రోజుల్లో అందమైన రాత వుండాలి. సూట్ కేసు మోయగల ఓపిక వుండాలి. అంతే అసిస్టెంట్ డైరక్టర్ అయిపోవచ్చు. అలా ఎస్ ఎస్ రవిచంద్ర దగ్గర అసిస్టెంట్ అయ్యాను.

ఎస్ ఎస్ రవిచంద్ర నుంచి ఎస్ ఎస్ రాజమౌళి దాకా వచ్చారన్నమాట

అవును. విక్రమార్కుడు నుంచి రాజమౌళి దగ్గర వుంటున్నాను. మధ్యలో నా ప్రయత్నాలు, నా కథలు మామూలే. రాజన్నకు నాగార్జున గారి దగ్గర కొంతకాల వున్నా, నాగచైతన్య కోసం నెపోలియన్ లైన్ చెప్పాను. కానీ ఎందుకో కుదరలేదు. మాంచి మాస్ సబ్జెక్ట్. పైగా భారీ సినిమా. నా కథలన్నీ భారీ సినిమాలకు పనికి వచ్చేవే.

అంటే మీరు గురువు రాజమౌళి టైపే అన్నమాట. మరి ఈ సినిమా సంగతేమిటి?

ఇది ఓ ప్రెండ్ చెప్పిన లైన్. దాన్ని డెవలప్ చేసి చెప్పా.సాయిగారికి నచ్చింది. అందరికీ నచ్చింది. 

తండ్రి, కొడుకు, ఓ అమ్మాయితో లవ్ స్టోరీ. ఏంటీ సెంటిమెంట్ అని పించలేదా?

అందరూ అలాగే అన్నారు. కానీ సినిమా పూర్తయ్యాక భలే తీసావ్ అంటున్నారు. రమ మేడమ్ కూడా అలాగే అన్నారు. లైన విని ఏదో అనుకున్నా, బాగా తీసావు అని. అయినా మనిషి అన్నాక ఇలాంటి బలహీనతలు కామన్. కొందరు చెబుతారు. కొందరు చెప్పరు. అంతే. 

అజయ్..నెగటివ్ నటుడు. క్యారెక్టర్ లో నెగిటిట్ షేడ్. జనాలు ముందే ఫిక్సయిపోరా?

ఏమీ కాదు. సినిమా చూస్తే అజయ్ ను ఇలా కూడా చూపించవచ్చా..అంటారు. అంత బాగా చేసారు.అసలు అజయ్ ను వద్దంటే నేను సినిమాయే చేసేవాడిని కాదు.

అజయ్…ఎప్పుడో మరిచిపోయిన ఇంద్రజ..వీళ్లని మీరు ఎలా ఎంచుకున్నారు.

కథ తయారు కాగానే వీళ్లయితే సరిపోతారు అని అనిపించడం వల్ల. ఇంటర్ నెట్ ను అలా కెలుకుతూనే వుంటా రాత్రి రెండు వరకు. ఇంద్రజ అలాగే గుర్తుకొచ్చింది.ఆఖరికి సినిమా టైటిల్ కూడా అలాగే దొరికింది.

ఇలాంటి కథకు మరీ ఎక్కువ ఎమోషన్లు ప్రమాదం కదా..పైగా వల్గారిటీ ఏంగిల్ జోడించినా కష్టమే కదా.

రెండూ నిజమే. ఒక కథ చెప్పడానికి చాలా మార్గాలు వుంటాయి. మేం వీలయినంత లైటర్ మార్గం ఎంచుకున్నాం. ఒక్క క్లయిమాక్స్ మాత్రం కొంచెం ఎమోషన్లు వుంటాయి.

సినిమా తయారీలో మీ గురువు రాజమౌళి పాత్ర ఎంత?

చాలా.. బాహుబలి బిజీలో వుండి కూడా రోజూ ఉదయం ఆరు నుంచి గంటా రెండు గంటలు దీని డిస్కషన్లుకు కేటాయించారు. 

కీరవాణికి ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ద..రాజమౌళి ప్రొడక్ట్ అనా?

విక్రమార్కుడి నుంచి ఆయన నాకు తెలుసు. నేను చేసిందల్లా ఒక్కటే స్క్రిప్ట్ చేతికి ఇచ్చా..ఆయన ఇన్ స్పియర్ అయి చేసారు. 

తరువాతి ప్రయత్నాలు?

నాగార్జున గారి దగ్గరకే వెళ్తా. ఆయనకు నేనంటే చాలా అభిమానం. నాగ్ చైతన్యతో సినిమా చేయాలి.

సాయి గారిని వదిలేస్తారా?

ఎంతమాట. ఆయన లేకుంటే పి కోటి…దర్శకుడు త్రికోటిగా మారేది లేదు. ఆయన అడిగితే ఏ సినిమా అయినా చేస్తా

బెస్టాఫ్ లక్

థాంక్యూ

చాణక్య

[email protected]