సెమిస్ మ్యాచ్.. టీమిండియా టార్గెట్ 240!

ఎట్టకేలకూ వరుణుడు తెరిపిని ఇవ్వడంతో ప్రపంచకప్ సెమిస్ మ్యాచ్ రిజర్వ్ డే రోజున సాగుతూ ఉంది. నిన్న ఆగిన చోట నుంచి మ్యాచ్ ఈ రోజు మొదలైంది. 46.1 ఓవర్లకు గానూ నిన్న 211…

ఎట్టకేలకూ వరుణుడు తెరిపిని ఇవ్వడంతో ప్రపంచకప్ సెమిస్ మ్యాచ్ రిజర్వ్ డే రోజున సాగుతూ ఉంది. నిన్న ఆగిన చోట నుంచి మ్యాచ్ ఈ రోజు మొదలైంది. 46.1 ఓవర్లకు గానూ నిన్న 211 పరుగులు చేసిన న్యూజిలాంట్ మిగిలిన 3.5 ఓవర్లను ఆడేసింది.

మొత్తంగా ఎనిమిది వికెట్లను కోల్పోయి ఆ జట్టు 239 పరుగులు సాధించి, 240 పరుగుల లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది. 50 ఓవర్లకు టీమిండియా లక్ష్యం 240గా ఉంది. ఈ లక్ష్యాన్ని చేధిస్తే టీమిండియా సగర్వంగా ఫైనల్ లోకి ఎంటర్ అయ్యే కావొచ్చు.

అయితే వరుణుడు ఇంతటితో మ్యాచ్ కు అంతరాయం కలిగించడా? అంటే చెప్పలేని పరిస్థితి. యాభై ఓవర్ల ఆట సాగని పక్షంలో డక్ వర్త్ లూయిస్ తో మ్యాచ్ పరుగుల లెక్కలు మారిపోవచ్చు. కనీసం 20 ఓవర్ల పాటు ఇండియా ఇన్నింగ్స్ సాగితే.. మ్యాచ్ ఫలితాన్ని ప్రకటించే అవకాశాలుంటాయి. ఇక వర్షం నేపథ్యంతో, మారిన వాతావరణం నేపథ్యంలో.. న్యూజిలాండ్ బౌలర్లకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం ఉంటుందనేది కూడా మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించవచ్చు. 

దెయ్యాన్ని పట్టుకోవడానికి పోలీసును పిలవడం ఏంటి రాజా