గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు ఇవి. మొత్తం పద్నాలుగు రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం పద్నాలుగు పని దినాలు ఉంటాయని, ఈనెల 30 వరకూ సమావేశాలు కొనసాగుతాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రకటన చేశారు.
సమావేశాల్లో భాగంగా ఈనెల 12న అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టనున్నారు. సెలవు దినాలు పోనూ ఈనెల 30 వరకూ సభ సాగనుంది. ఇక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తొలి బడ్జెట్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిని సంతరించుకుంది.